“ప్రభాస్” ఫిట్‌నెస్ వెనుక ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా..? ఇతనికి ప్రభాస్ ఇచ్చిన బహుమతి ఏంటంటే..?

“ప్రభాస్” ఫిట్‌నెస్ వెనుక ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా..? ఇతనికి ప్రభాస్ ఇచ్చిన బహుమతి ఏంటంటే..?

by Mounika Singaluri

బాహుబలి ప్రభాస్ కి ఫ్యాన్ ఇండియా వైడ్ వచ్చేసింది. ఆయన ఏ సినిమా చేసిన ఇండియాతో పాటుగా ప్రపంచ దేశాల అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే సినిమాకి సినిమాకి తగ్గట్టుగా ప్రభాస్ తన బాడీ ఫిజిక్ ని మార్చుకుంటూ ఉంటారు.

Video Advertisement

అయితే తాజాగా విడుదలైన సలార్ మూవీలో ప్రభాస్ కట్ అవుట్ ఫ్యాన్స్ అందరిని విపరీతంగా ఆకట్టుకుంది. కండలు తిరిగిన దేహంతో బైసప్స్ తో ప్రభాస్ చాలా దృఢంగా కనిపించారు. అయితే ప్రభాస్ బాడీ ఫిట్ నెస్ వెనకాల ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో మీకు తెలుసా? అయితే ఈ వివరాలు మీకోసమే…!

man behind prabhas fitness

ప్రభాస్ ఫిట్ నెస్ ట్రైనర్ పేరు లక్ష్మణ్ రెడ్డి. 2010లో మిస్టర్ వరల్డ్ టైటిల్ విజేత. 13 నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టైటిల్స్ గెలిచాడు. అలాగే నేషనల్ వాలీబాల్ ప్లేయర్ కూడా. ఇంతటి బ్యాగ్రౌండ్ ఉంది కాబట్టే బాహుబలి ప్రభాస్ కి పర్సనల్ ఫిట్ నెస్ ట్రైనర్ గా ఉన్నాడు. ప్రభాస్ డైట్ కంట్రోల్ అంతా లక్ష్మణ్ రెడ్డి నే చూసుకుంటాడు. సినిమాకి తగ్గట్టుగా ప్రభాస్ బాడీ చేంజెస్ అన్ని లక్ష్మణ్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంటాయి. ప్రభాస్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కేర్ తీసుకుంటారని ఆయన సన్నిహితులు కూడా చెబుతున్నారు.

man behind prabhas fitness

అయితే ప్రభాస్ కూడా లక్ష్మణ్ రెడ్డి పట్ల తన ప్రేమని అభిమానాన్ని ఒక సందర్భంలో చాటుకున్నారు. తన ఫిట్నెస్ ట్రైనర్ కి ఎవరు ఊహించిన విధంగా 73 లక్షల విలువలు చేసే రేంజ్ రోవర్ కార్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. ప్రభాస్ లక్ష్మణ్ రెడ్డి గురించి చెప్తూ కేవలం నా బాడీ ఫిట్ నెస్ గురించే కాకుండా నా మెంటల్ స్టేట్ ని కూడా ఆలోచించి దానికి తగ్గట్టుగా లక్ష్మణ్ రెడ్డి ట్రైనింగ్ ఇస్తారంటూ మెచ్చుకున్నారు. ప్రభాస్ తన పర్సనల్ ట్రైనర్ కి ఇంతటి కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వడంతో ఆయన అభిమానులు చాలా ఆనందానికి లోనవుతున్నారు. ప్రభాస్ నిజంగానే డార్లింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు


You may also like

Leave a Comment