Ads
అరబిక్ కూతు సాంగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికి తెలిసింది. యూట్యూబ్ లో చాలా రోజుల పాటు ట్రెండింగ్ లో ఉంది. బుట్ట బొమ్మ సాంగ్ కూడా సంచలనం సృష్టించింది. ఈ రెండు పాటలకు జానీమాస్టర్ కొరియోగ్రఫర్ గా పనిచేశారు.
Video Advertisement
అయితే ఈ పాటలకు జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రఫర్ గా మొయిన్ మాస్టర్ పనిచేశారు. సాంగ్స్ లో హీరోలకు స్టెప్స్ ఎలా చేయాలో చెప్పేది అసిస్టెంట్ కొరియోగ్రఫర్స్. అరబిక్ కూతు సాంగ్ లో దళపతి విజయ్ కు, బుట్టబొమ్మలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి స్టెప్స్ చెప్పి, చేయించింది మొయిన్ మాస్టర్. అతని గురించిన వివరాలు ఇప్పుడు చూద్దాం..
జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ , కోలీవుడ్ లో టాప్ హీరోల సినిమాలకి కొరియోగ్రఫర్ గా పని చేస్తున్నారు. ఆయన దగ్గర చాలా ఏళ్ల నుండి అసిస్టెంట్ కొరియోగ్రఫర్ గా మొయిన్ మాస్టర్ పనిచేస్తున్నారు. మొయిన్ పాపులర్ డాన్స్ షో అయిన ‘ఢీ’ లో పార్టీసిపెట్ చేశారు. ఆ షో ద్వారా పాపులర్ అయ్యారు.
ఆ తరువాత జానీ మాస్టర్ దగ్గర పని చేశారు. అలా ఎన్నో హిట్స్ సాంగ్స్ కి అసిస్టెంట్ కొరియోగ్రఫర్ గా చేశారు. తనకు ఇంత పేరు రావడానికి కారణం అసిస్టెంట్ మొయిన్ మాస్టర్ అని ఒక సందర్భంలో జానీ మాస్టర్ అన్నారు. సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ సినిమాతో కొరియోగ్రఫర్ మారారు. ఆ తరువాత కార్తికేయ హీరోగా నటించిన బెదురులంక 2012 సినిమాకి కొరియోగ్రఫి అందించారు.
మొయిన్ మాస్టర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఆయన షేర్ చేసిన పోస్ట్‌లు అన్నిటికి జాని మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా, మొయిన్ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రఫర్ గా పని చేశారు. ఇటీవలే మొయిన్ మాస్టర్ కి ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఇంస్టాగ్రామ్ లో మొయిన్ మాస్టర్ ను 24.9 వేలమంది ఫాలో అవుతున్నారు.
https://www.instagram.com/reel/Cs7vfDVPKCR/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D
End of Article