Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ బిజినెస్ మెన్. ఇటీవలే మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రీరిలీజ్ అయ్యి, కలెక్షన్స్ లో రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే.
Video Advertisement
మహేష్ బాబు కెరీర్ లోనే బిజినెస్ మెన్ స్టైలిష్ మూవీ అని చెప్పవచ్చు. సూర్య అంటే ఒక పేరు కాదు ఒక బ్రాండ్ అని ఈ మూవీలో మహేష్ బాబు చెప్పిన డైలాగులు, యాక్షన్ సీన్స్ మూవీకి హైలైట్ గా నిలిచాయి. అయితే ఇది ఫిక్షనల్ స్టోరీ కాదు. ఈ మూవీ ఒక వ్యక్తో రియల్ లైఫ్ ఆధారంగా తీసిన మూవీ ఇది. మరి ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు చూద్దాం..
మహేష్ బాబు ఈ చిత్రంలో సరికొత్తగా, గ్యాంగస్టర్ గా కనిపించారు. ఈ సినిమాలో సాధారణ వ్యక్తి, ముంబైకి వెళ్ళి సూర్య భాయ్ గా ఎదుగుతాడు. ఈ క్యారెక్టర్ లో మహేష్ బాబు నటనకు ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. ఈ మూవీలో హీరోయిన్ గా కాజల్ నటించింది. థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. మహేష్ బాబు కెరీర్ లో ఈ చిత్రం మర్చిపోలేని మూవీ అని చెప్పవచ్చు. మూవీ అంతా ముంబై నేపథ్యంలోనే సాగుతుంది.
అయితే బిజినెస్ మెన్ మూవీ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ కథ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిందని తెలుస్తోంది. అలా ముంబైకి వెళ్లి గ్యాంగస్టర్ గా ఎదిగిన వ్యక్తి పేరు సతువాచారి వరదరాజన్ ముదలియార్. ఆయన 1960 లో సాధారణ వ్యక్తిగా ముంబైకి వెళ్లి, ఒక ముంబై డాన్ వరదా బాయ్ గా ఎదిగారట. సతువాచారి 1926 లో అక్టోబర్ 9న జన్మించారు.
వరదా బాయ్ ని వర్ధ అని కూడా అనేవారంట. అంతేకాకుండా ఇండియన్ క్రైమ్ బాస్ అని కూడా పిలిచేవారట. వరదా బాయ్ 1988లో జనవరి 2న మరణించారు. వరదా బాయ్ నిజ జీవిత కథ ఆధారంగానే డైరెక్టర్ పూరి జగన్నాధ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో బిజినెస్ మెన్ మూవీని తీశారు. కమల్ హాసన్ నటించిన నాయకుడు సినిమా కూడా వరదా బాయ్ ని కథతో తెరకెక్కింది.
Also Read: మెహర్ రమేష్ సినిమా గురించి… పూరి జగన్నాధ్ ఆ సినిమాలో అప్పుడే చెప్పారా..?
End of Article