చాలా మంది ఇళ్లల్లో కోడళ్ళకి, కూతుళ్ళకి పక్షపాతం జరగడం అనేది చూస్తూనే ఉంటాం. ఎవరైనా కూతురికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ కోడలికి ఇవ్వరు. కూతురుతో ఉన్నంత ప్రేమగా కోడలితో ఉండలేరు. కూతురికి ఒక నియమం ఉంటే, కోడలికి మరొక నియమం ఉంటుంది. చాలా మంది ఇళ్లల్లో పండగలకి కానీ, లేదా ఏదైనా సందర్భానికి కానీ కూతుళ్లని ఇంటికి పిలుస్తారు. కానీ కోడళ్లని వాళ్ళ ఇంటికి పంపరు. ఒకవేళ పంపినా కూడా తొందరగా వచ్చేయ్ అని చెప్తూ ఉంటారు.

Video Advertisement

Things that a mother should tell her son before getting married

ఇవన్నీ ఇప్పటినుంచి కాదు. మన భారత దేశంలో ఎన్నో తరాల నుండి వస్తున్న సమస్యలు. కొంత మంది అయితే, వారికి ఒక కొడుకు, ఒక కూతురు ఉంటే, పెళ్లి అయిన తర్వాత కూడా వారు ఒకటే ప్రదేశంలో ఉండాలి అని అనుకుంటారు. కొడుకు వేరే ఏదైనా విదేశానికి కానీ వేరే రాష్ట్రానికి  కానీ వెళితే, కూతురిని కూడా అక్కడే సెటిల్ అయ్యేలా చేస్తూ ఉంటారు. దీనికి కారణం ఇద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటారని అని చెప్తారు. కానీ ఇది కూడా తప్పే అని నిపుణులు చెబుతున్నారు.Man should solve problem between his mother and wife

దీనివల్ల వారిద్దరి మధ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అని అంటున్నారు.  కొందరు తల్లులు భార్యని కంట్రోల్ లో పెట్టుకోవాలని కొడుకులకు చెప్తూ ఉంటారు.. ఇలా నేర్పడం వలన అబ్బాయిల దృష్టిలో భార్య అంటే తమకంటే తక్కువ, తాను చెప్పినట్లే వినాలి అన్న ఆధిక్య భావం కలుగుతుంటుంది. అంతే కాకుండా తల్లికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ.. భార్యని పరాయిదానిగా చూస్తూ ఉంటారు. దీనివలన ఆత్మాభిమానం కలిగిన అమ్మాయిలు భర్త ప్రవర్తనని సహించలేరు. దీనివల్ల గొడవలు మరింత ఎక్కువ అవుతాయి. Man should solve problem between his mother and wife

అయితే ఇలాంటి గొడవలు జరుగుతున్నప్పుడు మగవారు కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తే ఇవన్నీ ఆగిపోతాయి అని చెప్తున్నారు. అంటే, ఇప్పుడు ఇంట్లో తల్లి, భార్య మధ్య గొడవ పడుతూ ఉంటే, ఇంట్లో ఉన్న మగ వారు వచ్చి గొడవలు ఆపడానికి ప్రయత్నిస్తే, అలాగే తన భార్యకి కూడా ప్రాముఖ్యత ఇస్తే ఇన్ని సమస్యలు తలెత్తవు అని చెబుతున్నారు. వారి తల్లికి, అక్కాచెల్లెళ్లకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి, భార్యని  తక్కువగా చూస్తే మాత్రం ఇలాంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. భార్య తన కోసం వచ్చింది. కాబట్టి తాను తన భార్య కోసం వీలైనంత చేయాలి అని, తన జీవితంలో తన భార్యకి కూడా ఒక బలమైన స్థానం ఇవ్వాలి అని, అలాగే తన తోబుట్టువులతో, తల్లితో సమానంగా తన భార్యని కూడా ప్రేమించాలి అని నిపుణులు చెబుతున్నారు.

watch video :

 

NOTE: images used in this article are just for representative purpose. But not the actual characters.