Ads
ఒక ప్రశ్నకి ప్రపంచం మొత్తంలో ఎక్కడినుంచైనా సమాధానం దొరికే చోటు కోరా. ఇందులో ఎంతో మంది ఎన్నో రకాల ప్రశ్నలు పోస్ట్ చేస్తే, దానికి ఎంతో మంది తాము ఏం అనుకుంటున్నాం అనేది వ్యక్తపరుస్తారు. అంతే కాకుండా ఇందులో అనేక మంది తమ జీవితం లో జరిగిన విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి ఒక వ్యక్తి దేవరపాగ. తన జీవితం లో జరిగిన ఒక దురదృష్ట సంఘటనని కోరా సభ్యులతో పంచుకున్నారు. దాని నుంచి బయటపడి జీవితం ఎలా ముందుకు సాగారో ఆయన వివరించారు.
Video Advertisement
” నేను అమ్మ నాన్నకు ఒక్కగాను ఒక్క కొడుకుని. 2008 ఏప్రిల్ నెల లో ఉగాది పండగ కోసమని అమ్మ నాన్న నాకు ఫోన్ చెసి రమ్మని చెప్పారు. పండగకి మా పెద్దమ్మ కూతురు మా బావ వస్తున్నారు. వారికీ చాలా ఏళ్లకు పిల్లలు పుట్టారు అని అమ్మ రమ్మంది బట్టలు పెట్టడానికి. అప్పుడు సోమవారం పండుగ కావడంతో ఆదివారం అందరికి గిఫ్ట్స్, బట్టలు, స్వీట్స్ తీసుకొని బయలు దేరాను.
అప్పట్లో శంషాబాద్ ఇంటెర్నేషన్ ఎయిర్ పోర్ట్ పనులు జరుగుతున్నాయి. మా అమ్మ, నాన్న అక్కడ కూలి పనులు చేస్తూ ఉండేవారు. అక్కడికి వెళ్ళాలి అంటే గేట్ పాస్ కావాలి. దీంతో నేను గేట్ బయటే ఉండిపోయాను. అప్పుడు మా అమ్మ మా నాన్న గేట్ పాస్ తీస్కొని నన్ను లోపలి తీసుకెళ్లడానికి వస్తుంది.
నేను గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. అప్పుడు నాకు తెలిసిన ఆవిడ నా వైపు పరిగెత్తుకుంటూ వచ్చి చిన్నోడా మీ అమ్మ ట్రాక్టర్ కింద పడింది దెబ్బలు తగిలాయి అని చెప్పింది. నాకు ఒక్క క్షణం ఎం అర్థం కాలేదు. వెంటనే పరిగెత్తుకుని వెళ్లి అమ్మని చూసాను. అప్పటికి ప్రాణం ఉంది. కానీ హాస్పిటల్ కి వెళ్లే సరికి చనిపోయింది. మా నాన్న నా ఏడుపు చూసి తట్టుకోలేకపోయాడు.
కొన్ని రోజులకు నేను నా పని కోసం వెళ్ళిపోయాను. కానీ మా నాన్న ఒక్కడే ఉంది, అమ్మ పోయిన బాధలో మందుకు బానిస అయ్యాడు. ఆ తర్వాత నాలుగు నెలలకే మా నాన్న కూడా నాకు దూరం అయ్యాడు.
ఆ సంఘటనతో ఒక్కసారిగా నా జీవితంలో చీకటి కమ్మేసింది. ఒంటరి వాడ్ని ఐపోయాను. ఎన్నో అవమానాలు పడ్డాను, ఆకలితో ఉన్న రోజులు కూడా ఉన్నాయి. చివరికి అమ్మ మీద ప్రేమతో వాళ్ళ చుట్టాల అమ్మాయినే 2016 లో పెళ్లి చేసుకున్నాను. తర్వాత ఒక బాబు, పాపా పుట్టారు. మా అమ్మ నాన్న నా దగ్గరకు వచ్చారు అనే సంతోషం తో .. చిన్న కుటుంబం తో బతుకుతున్నా.” అని దేవరపాగ కోరా లో చెప్పుకొచ్చారు.
End of Article