ఈ ఒక్క విషయం వల్ల నా భార్య చేతిలో అవమానాలు ఎదుర్కొంటున్నాను..! ఇది కూడా పట్టించుకునే వాళ్ళు ఉంటారా..?

ఈ ఒక్క విషయం వల్ల నా భార్య చేతిలో అవమానాలు ఎదుర్కొంటున్నాను..! ఇది కూడా పట్టించుకునే వాళ్ళు ఉంటారా..?

by Harika

Ads

భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం. కానీ అవి ఎంతవ రకు వెళ్తాయి అనేదే ముఖ్యం అవుతుంది. కొన్ని గొడవలు ఒక మనిషిపై ప్రభావం చూపుతాయి. ఇప్పుడు ఒక వ్యక్తి విషయంలో అలాగే జరిగింది. ఆ కథ ఏంటో అతని మాటల్లోనే విందాం. నా పేరు శేఖర్. కాలేజ్ రోజుల నుండి కూడా సినిమా అంటే చాలా ఇష్టం. సినిమాలు చూడటం మాత్రమే కాదు. సినిమాలు తీయాలి అనే ఆలోచన ఉంది. దాంతో కాలేజ్ రోజుల్లోనే షార్ట్ ఫిలిమ్స్ చేసేవాడిని. ఒకసారి నా ఇంటర్ స్నేహితులు అందరూ కూడా కలిసాం. అప్పుడు నా ఫ్రెండ్ విద్యని కలిసాను. తనకి నాకు ఇలా సినిమాలు అంటే ఇష్టం అని చెప్పాను.

Video Advertisement

అప్పటి వరకు అందరూ, “సినిమాలు అవసరమా?” అని అన్నారు. కానీ విద్య మాత్రమే, “అలాంటి ప్రొఫెషన్ ఎంచుకోవడం చాలా గ్రేట్” అని అంది. దాంతో నాకు ఆ విషయం చాలా ఆనందంగా అనిపించింది. అప్పటి నుండి విద్యతో మాట్లాడటం మొదలు పెట్టాను. మెల్లగా మా స్నేహం ప్రేమగా మారింది. ఒకసారి నేనే తనకి చెప్పేసాను. తను కూడా నా ప్రేమని అంగీకరించింది. నాకు డైరెక్టర్ అవ్వాలి అని ఉంది అనే విషయం కూడా చెప్పాను. పెళ్లి తర్వాత కూడా తను నా లక్ష్యాన్ని చేరుకోవడంలో సపోర్ట్ చేస్తాను అంది. ఇద్దరి ఇళ్లల్లో ఒప్పించాం. విద్య ఇంట్లో ఒప్పుకోవడం కాస్త కష్టం అయ్యింది. కానీ తను ఒప్పించింది. అలా మా పెళ్లి జరిగింది.

man struggle with his wife

నేను కూడా డైరెక్టర్ అవ్వడానికి ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టాను. కానీ ఇంత పెద్ద ఇండస్ట్రీలో నెగ్గుకు రావడం అంటే చిన్న విషయం కాదు. రోజు ఏదో ఒక ప్రయత్నం చేద్దామని వెళ్లేవాడిని. నిరాశగా ఇంటికి వచ్చేవాడిని. ఒక ఏడాది ఇలాగే గడిచిపోయింది. విద్య మాత్రం నాకు అలాగే సపోర్ట్ చేస్తూ వచ్చింది. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాను. పని చాలా ఎక్కువగా ఉండేది. కానీ సినిమా తీయడం ఎలా అనే విషయంలో టెక్నిక్స్ తెలిసేవి. మెల్లగా విద్యలో మార్పు రావడం మొదలయ్యింది. చిన్న చిన్న వాటికి విసుక్కునేది. ఎంత బిజీగా ఉన్నా కూడా నేను తనతో సమయం గడపడానికి ప్రయత్నించే వాడిని.

ఒకరోజు, “ఇవన్నీ వదిలేసి ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు కదా?” అని కోపంగా చెప్పింది. నాకు ఏమీ అర్థం కాలేదు. విద్యలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో తెలియట్లేదు. అప్పటికి నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. కానీ డైరెక్టర్ అవ్వడం అనేది అంత సులభమైన విషయం కాదు. అలా అని చెప్పి నేను నా లక్ష్యాన్ని వదులుకోలేను. అందరికంటే ఎక్కువగా నన్ను నమ్మిన తనే ఇప్పుడు నేను దేనికి పనికిరాని వాడిని అన్నట్టు చూస్తోంది. నా వయసు వాళ్ళు అందరూ చాలా బాగా సెటిల్ అయిపోయారు అని అంటోంది. తన మాటల వల్ల నా ఆత్మవిశ్వాసం పోతోంది.

నా మీద నాకు అసలు నమ్మకం లేదు. కాన్ఫిడెన్స్ కూడా లేదు. మానసికంగా చాలా బాధగా అనిపిస్తుంది. ఒకసారి ఇదే విషయం తనకి చెప్పాను. ఇవన్నీ మాటలు అనుకొని అసలు నేను చెప్పేది వినలేదు. ఇది ఇంకా బాధగా అనిపించింది. ఈ విషయానికి కూడా నన్ను అవమానిస్తుందా? అన్నీ తెలిసే పెళ్లి చేసుకుంది కదా? ఇప్పుడు ఇలా ఎందుకు మారిపోయింది? ఇప్పుడు నేనేం చేయాలి? నా లక్ష్యాన్ని వదిలేయడం కూడా తప్పు కదా? నా పరిస్థితికి పరిష్కారం కూడా నాకు అర్థం కావట్లేదు.

ALSO READ : సీనియర్ ఎన్టీఆర్ తో ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా..? ఎన్టీఆర్ గురించి ఈయన చెప్పినట్టే జరిగింది..!


End of Article

You may also like