తాజాగా మంచు లక్ష్మి అనుష్క శెట్టి గురించి కామెంట్లు చేశారు. అవి ఇప్పుడు వైరల్ గా మారాయి. మంచు లక్ష్మి టాక్ షో లని నిర్వహిస్తూ ఉంటుంది. తన టాక్ షోలకి చాలా మంది సెలబ్రిటీలు వస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య సెలబ్రిటీ టాక్ షోలని చేయడం లేదు.

Video Advertisement

మళ్లీ మళ్లీ ఇంటర్వ్యూలకి పిలుస్తూ ఉంటే విసుగ్గా ఉందని మంచు లక్ష్మి చెప్పారు. అలానే ఎన్ని సార్లు అదే ప్రశ్నలు అడుగుతానని మంచులక్ష్మీ చెప్పారు.

ఈ కారణం వల్లనే మంచు లక్ష్మి టాక్ షోలకి బ్రేక్ ఇచ్చారట. అయితే తాజాగా అనుష్క గురించి చేసిన కామెంట్స్ విషయానికి వస్తే… ఒకసారి అనుష్క శెట్టి ని తన టాక్ షో కి పిలిచిందట. అయితే అప్పుడు తానే టాక్ షో కి పూర్తిగా బాధ్యత తీసుకునేది. గెస్ట్లు తన షో కి వచ్చే వరకు కూడా టెన్షన్ ఉండేదని మంచు లక్ష్మి చెప్పింది. అనుష్క శెట్టి ని గెస్ట్ కింద పిలిచినప్పుడు లాస్ట్ మూమెంట్ వరకు కంగారు పడ్డానని మంచు లక్ష్మి అంది. గెస్ట్ కింద వచ్చే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తానని ఆఖరి వరకు కూడా బాధ్యత తీసుకుంటానని చెప్పింది లక్ష్మి. అయితే అనుష్క ని పిలిచినప్పుడు అనుష్క ఒక ఈవెంట్లో ఉండిపోయింది.

anushka - naveen polisetty movie story resembles the recent releases..??

భాగమతి సినిమా ప్రమోషన్స్ లో రాజమండ్రి వెళ్ళినప్పుడు ఆమె చిక్కుకుపోయింది. షో కి రెండు రోజులు ముందు కూడా టచ్ లో లేదట. దానితో లక్ష్మీ కంగారు పడ్డానని చెప్పింది. తనకి పూలను పంపించిందట అలానే ఫ్రెండ్స్ కి కూడా ఫోన్ చేసి కనుక్కుందట. కానీ అనుష్క గురించి తెలియలేదు. అయితే అనుష్క శెట్టి ఇంటికి వచ్చేసరికి తన ఫోన్ అంతా కూడా మంచు లక్ష్మి మెసేజ్లతో నిండిపోయింది. అనుష్క వస్తానని చెప్పాను కదా అని మంచు లక్ష్మి తో చెప్పింది. అప్పుడు లక్ష్మీ నేను కంగారు పడ్డాను అందుకే ఇలా చేశానని అనుష్క శెట్టితో చెప్పింది.