Ads
మంచు మనోజ్ ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికని ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి వార్త సినీ, రాజకీయ రంగంలో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. అయితే తాజాగా వీరిద్దరూ టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ వ్యాఖ్యాతగా మొదలైన ఒక టాక్ షో లో పాల్గొన్నారు.
Video Advertisement
ఈ షోలో పాల్గొన్న మనోజ్ అండ్ మౌనిక తమ పరిచయం మరియు బంధం గురించి ఎన్నో విషయాలను తెలిపారు. ఈ క్రమం లో అహం బ్రహ్మాస్మి మూవీ ఆగిపోవడానికి కారణం ఏంటని వెన్నెల కిషోర్ ప్రశ్నించారు. గతంలో మనోజ్ కొత్త దర్శకుడు శ్రీకాంత్ తో ‘అహం బ్రహ్మాస్మి’ మూవీ స్టార్ట్ చేసారు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ మధ్య లోనే ఆగిపోయింది.
తాజాగా ఈ సినిమా గురించి మనోజ్ మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. ” అహం బ్రహ్మాస్మి కోసం రెండేళ్ల పాటు కష్టపడ్డాం. ఈ చిత్ర ఓపెనింగ్ కి నా మిత్రుడు రాంచరణ్ వచ్చారు. అదే సమయంలో మౌనికతో నా బంధం ఏర్పడింది. ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఆ సమయంలో నేను కెరీర్ కోసం, డబ్బు కోసం ఆశ పడి ఉంటే నేను బ్రతకడమే వేస్ట్ అనిపించింది. సినిమానా.. మౌనికా అని అనుకున్నప్పుడు నేను మౌనికని ఎంపిక చేసుకున్నా.
ఆ సమయం లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇక్కడ ఉంటే మాకు ఇబ్బంది అవుతుందని చెన్నై కి వెళ్లాం. ఏడాదిన్నర పాటు చెన్నైలోనే ఉన్నాం. ఈ విషయం ఎవరికీ తెలియదు. దీనితో తప్పని పరిస్థితుల్లో అహం బ్రహ్మాస్మిని వదిలేశా. దర్శకుడు శ్రీకాంత్ ని క్షమించమని కోరా. ఇప్పుడు శ్రీకాంత్ వైష్ణవ్ తేజ్ తో సినిమా చేయడం నాకు సంతోషం గా ఉంది.” అని మంచు మనోజ్ వెల్లడించారు.
కానీ భవిష్యత్తులో కచ్చితంగా అహం బ్రహ్మాసి చిత్రం చేస్తా అని కూడా మనోజ్ తెలిపారు. ఇటీవల వివాహం చేసుకున్న మనోజ్, మౌనిక జంట కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మౌనిక, మనోజ్ జీవితంలో అనుభవించిన కష్టాలు.. వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది లాంటి విషయాల్ని వెన్నెల కిషోర్ ఆ టాక్ షో లో అడిగి తెలుసుకున్నారు.
End of Article