హీరో మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిని ఇటీవల పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక జరిగింది. కాగా, వీరిద్దరికి పరిచయం అయిన దగ్గర నుండి, ప్రేమ, వివాహం వరకు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలుస్తోంది. అయితే ఈ జంట కమెడియన్ వెన్నెల కిశోర్ హోస్ట్ గా చేస్తున్న ఒక షోలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది.
Video Advertisement
దీనిలో మనోజ్, మౌనిక వారి జీవితానికి సంబధించిన విషయాలు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనోజ్, వెన్నెల కిషోర్ ఇద్దరు మంచి స్నేహితులు. వెన్నెల కిషోర్ అడిగిన ప్రశ్నలకు మనోజ్ సమాధానం చెప్పినట్లు ఆ ప్రోమో చూస్తే తెలుస్తోంది. వీరిద్దరు మొదటిసారి ఎప్పుడు కలుసుకున్నారనే విషయంతో పాటు, ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ గురించి చెప్పినట్టు తెలుస్తోంది. మనోజ్, మౌనికలు తమ లవ్ జర్నీలో ఎమోషనల్ యాంగిల్స్ కూడా ఉన్నట్లు చెప్పారు.
ఈ క్రమంలో మనోజ్ మాట్లాడుతూ ఉప్పెన మూవీలో ”ఈశ్వర సాంగ్ ఐదు నిమిషాలుంటే మా జీవితంలో అయితే సంవత్సరాల పాటు ఉందని” మనోజ్ పెళ్లికి ముందు జరిగిన వాటి గురించి చెప్పినట్లు తెలుస్తుంది. మౌనిక మాట్లాడుతూ తన తల్లి చనిపోయిన తర్వాత వచ్చిన పుట్టిన రోజున అలా ఆకాశం వైపు చూస్తూ బాధపడడం గురించి చెప్తూ, ఆరోజు మనోజ్ ఆళ్లగడ్డకి రాడని అనుకున్నట్లు, జీవితంలో ఆరోజును మరచిపోలేను’ అంటూ మౌనిక ఎమోషనల్ అయ్యారు.
తమ ప్రేమ విషయంలో చాలా వ్యతిరేక పరిస్థితులు వచ్చినట్లు మనోజ్ చెప్పారు. ఒక సమయంలో ప్రేమ, సినిమా రెంటిలో ఏదో ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ‘నన్ను నమ్మి ఓ బిడ్డతో ఉన్న ఒక అమ్మాయి జీవితం నిలబడుతుందంటే అది చాలు అనుకున్నానని తెలిపారు. వీరి ప్రేమ, పెళ్లి కోసం జరిగిన సంఘర్షణకు పూర్తిగా తెలుసుకోవాలంటే ఏప్రిల్ 18 వరకు ఆగాల్సిందే.
watch video :
To watch video, click on : Watch On YouTube
Also Read: O KALA REVIEW : డైరెక్ట్ OTT లో రిలీజ్ అయిన “ఓ కల” ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!