మంచు మనోజ్ మౌనిక కొన్ని రోజుల నుండి రిలేషన్ షిప్ లో ఉన్నారు. కొన్ని గంటల క్రితం వీళ్ళిద్దరి పెళ్లి జరిగింది. వీళ్ళ పెళ్లి కి సంబంధించి నెట్టింట అనేక విషయాలు బయటకు వచ్చాయి. మోహన్ బాబు వీళ్ళ పెళ్ళికి ఒప్పుకోలేదని… అందుకు మనోజ్ తన ఫ్యామిలీ కి సినిమాల కి కూడా దూరంగా ఉంటున్నారని కూడా వార్తలు వచ్చాయి.

Video Advertisement

అలానే మనోజ్ కూడా తన భార్య మౌనిక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది దాంతో ప్రతి ఒక్కరు కూడా అభినందనలు తెలుపుతున్నారు.

భూమా మౌనిక గురించి చాలా మందికి తెలీదు ఆమె బ్యాగ్రౌండ్ గురించి ఇప్పుడు చూద్దాం… మౌనిక అసలు పేరు భూమా నాగ మౌనిక రెడ్డి. ఈమె భూమా నాగిరెడ్డి భూమా శోభ రెడ్డి ల రెండవ కూతురు. చాలా కాలం నుండి కూడా మంచు ఫ్యామిలీకి భూమా ఫ్యామిలీకి పరిచయం ఉంది.

మౌనిక లో కూడా ఇది వరకు పెళ్లయింది గణేష్ రెడ్డి అనే ఒక వ్యక్తి ని 2016లో వివాహం చేసుకున్నారు. వాళ్లకి ఒక కొడుకు కూడా ఉన్నారు. తన పేరు ధైరావ్ రెడ్డి. మౌనిక గణేష్ మధ్య ఇబ్బందులు కలగడంతో వాళ్ళిద్దరూ కూడా విడిపోయారు. భూమా మౌనిక కి మంచి పేరు ఉంది. కర్నూలు లోని ఆళ్లగడ్డ నియోజకవర్గం మౌనికది. చుట్టుపక్కల కూడా ఈమెకి చాలా మంచి పేరు ఉంది. మనోజ్ కూడా తన భార్య ప్రణతి రెడ్డి కి విడాకులు ఇచ్చేశారు.

ఇది ఇద్దరికీ కూడా రెండవ పెళ్లి. మోహన్ బాబు కి మాత్రం మనోజ్ మౌనికని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. సోషల్ మీడియాలో ఇప్పుడు మనోజ్ మౌనికల పెళ్లి ఫోటోలు వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే ఈ మధ్యన మనోజ్ సినిమాలు చేయలేదు. మొన్న మొన్ననే ”వాట్ ది ఫిష్” అనే సినిమాని చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు మంచు మనోజ్ కానీ తన వ్యక్తిగత జీవితం గురించి ఎటువంటి విషయాలని బయట పెట్టలేదు. పెళ్లి ప్రస్తావన కూడా ఎక్కడా తీసుకురాలేదు మనోజ్.