విష్ణు మంచు చాలా కాలం తరవాత మళ్ళీ ఓ సినిమా చేసాడు. విష్ణు మంచు కథానాయకుడిగా జిన్నా అక్టోబర్ 21 వ తేదీన రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో పాయల్ రాజ్ ఫుత్ , సన్నీలియోన్ కూడా నటించారు. ఈ సినిమాకి ఈషాన్ సూర్య దర్శకత్వం వహించారు.

Video Advertisement

ఈ సినిమాని మంచు మోహన్ బాబు నిర్మించారు. పైగా ఈ సినిమా ని ఒక్క తెలుగు భాష లోనే కాక మలయాళం, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేసారు. అయితే ఈ సినిమా కూడా హిట్ అవ్వలేదు.

trolls on jampalakadi jaru mithya song from ginna movie..

మంచు విష్ణు కి జిన్నా నిరాశ పరిచింది. ఆశించిన ఫలితం జిన్నా కి రాలేదు. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే మొదటి రోజు ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా ఐదిహేను లక్షల రూపాయిల షేర్ వచ్చింది. డబ్భై లక్షల రూపాయిల షేర్ రాగ.. గ్రాస్ వచ్చేసి రూ.1.50 వుంది. ఇలా మంచు విష్ణు కి జిన్నా నిరాశ పరిచింది. ఎప్పుడు లేని విధంగా నష్టం వచ్చింది విష్ణు కి. నాలుగు కోట్లకు అమ్మారు సినిమాను. రూ.3.28 కోట్లు నష్టం వచ్చింది.

 

reasons behind ginna movie negative talk

విష్ణు ఆఖరుగా మోసగాళ్లు సినిమాలో నటించాడు. ఆ తరవాత ఇంకా ఏ సినిమాలు చెయ్యలేదు. జిన్నా లోనే నటించాడు. జిన్నా కూడా మోసగాళ్లు సినిమాలాగే కొత్తగా, డిఫెరెంట్ గా వుంది. పైగా కామెడీ సినిమా లో నటించి కూడా చాలా రోజులు అయ్యింది. కామెడీ సినిమా చేస్తే హిట్ ఉంటుందని ఎంచుకున్నాడేమో కానీ సినిమాకు నిరాశే మిగిలింది. పైగా కొన్ని హారర్ అంశాలు ఈ సినిమా లో వున్నా కూడా సినిమా హిట్ కాలేదు. రొటీన్ స్టోరీ ఏ కానీ ఈ జిన్నా కొంచెం డిఫరెంట్ గా వుంది కానీ మంచు విష్ణు కి జిన్నా హిట్ మాత్రం దక్కలేదు. పైగా ఈ సినిమా లో సంగీతం, సినిమాటోగ్రఫీ ఇవన్నీ బాగానే వున్నాయి. అలానే నటీ నటులు అందరూ కూడా చక్కగా యాక్ట్ చేసారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా కూడా బాగానే వుంది. మంచు విష్ణు కూడా కొత్తగా చిత్తూరు యాస మాట్లాడాడు.