Ads
ఆర్ఎక్స్ 100 మూవీ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన తాజా మూవీ మంగళవారం. ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజపుత్ మెయిన్ లీడ్ గా ఈ సినిమా వచ్చింది. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. పోటీగా పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో మంగళవారానికి బాగా కలిసి వచ్చింది. శని ఆదివారంలో డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Video Advertisement
ఇప్పటివరకు ఎవరు టచ్ అయిన పాయింట్ తో డైరెక్టర్ అజయ్ భూపతి ఈ మూవీని తెరికెక్కించాడు. పాయల్ రాజ్ పుత్ కూడా అద్భుతంగా పెర్ఫామ్ చేయడంతో సినిమా లాంగ్ రన్ లో మంచి హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఇలాంటి పాత్రలు చేయాలంటే చాలా గట్స్ కావాలి.
కానీ పాయల్ మాత్రం ఈ పాత్రను ఒప్పుకోవడమే కాకుండా తన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను బాగా అలరించింది.పాయల్ తో పాటు ఈ సినిమాలో మరికొందరు యాక్టర్స్ మంచి నటన కనబరిచారు కానీ వాళ్లలో బాగా హైలైట్ అయింది మాత్రం జమీందారు భార్యగా నటించిన అమ్మాయి.
చూడడానికి చాలా అందంగా కనిపించే ఈ అమ్మాయి చివరిలో ఇచ్చిన ట్విస్ట్ అందరికీ మతిపోయింది.సినిమా చూసిన చాలామంది ఈ అమ్మాయి ఎవరు అంటూ సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. దీంతో అమ్మాయికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ బయటికి వచ్చాయి.
Mangalvaram Movie Actress Divya
ఆమె పేరు దివ్య పిల్లై. ఆమె ఓ మలయాళీ నటి. మలయాళం లో చాలా సినిమాలు నటించింది. టివినో థామస్ కలా సినిమాలో హీరో భార్యగా నటించింది. మలయాళం తో పాటు తమిళ్ లో కూడా రెండు సినిమాలు చేసింది. ఇక తెలుగులో మంగళవారం సినిమా కంటే ముందు తగ్గేదేలే అనే మూవీలో నటించింది.
ఆ సినిమా ఎవరికి తెలియకపోవచ్చు కానీ ఆమె టాలెంటును గుర్తించి డైరెక్టర్ అజయ్ భూపతి మంగళవారం సినిమాలో మంచి అవకాశం ఇచ్చాడు. దీంతో ఆమె టాలెంట్ ను చూపించుకుంది అందరి దృష్టి ఆమెపై పడేలా చేసింది. రాబోయే రోజుల్లో టాలీవుడ్ లో ఈమెకి మంచి పాత్రలు దక్కే అవకాశం ఉంది.
Also Read:2 భాషల్లో రీమేక్… కానీ ఒరిజినల్ కి సాటి రాలేదు..! ఈ సినిమా చూశారా..?
End of Article