మంగళవారం సినిమా ఐదు రోజుల్లో ఎన్ని కోట్లు సాధించిందో తెలుసా? 

మంగళవారం సినిమా ఐదు రోజుల్లో ఎన్ని కోట్లు సాధించిందో తెలుసా? 

by Mohana Priya

Ads

డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ తాజాగా నటించిన చిత్రం మంగళవారం. ఇటీవల విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీని స్వాతి గుణుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మించారు.

Video Advertisement

ఇందులో అజయ్ ఘోష్, నందిత శ్వేత, కృష్ణ చైతన్య, దివ్య పిళ్లై తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీకి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం కాస్త వెనకబడింది అని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్ లను రాబట్టిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

mangalavaaram movie review

ఇండియాలోనే తొలిసారి భిన్నమైన కంటెంట్‌తో రూపొందిన మంగళవారం సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. దీంతో ఈ చిత్రం నైజాంలో రూ. 3.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్, సీడెడ్ ఏరియాలను కలుపుకుని రూ. 7 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి రూ. 2 కోట్లు బిజినెస్ చేసింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 12.20 కోట్లు బిజినెస్ అయింది. కాగా ఐదవ రోజు మంగళవారం సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే… వీకెండ్‌లో కలెక్షన్లు భారీగా వచ్చాయి. కానీ, ఆ తర్వాతనే ఈ సినిమా క్రమంగా డౌన్ అవుతూ వస్తోంది. ముఖ్యంగా నాలుగు, ఐదు రోజుల్లో రెస్పాన్స్ బాగా తగ్గింది.

mangalavaaram movie review

దీంతో పాయల్ రాజ్‌పుత్ నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు కేవలం రూ. 62 లక్షలు షేర్‌ మాత్రమే వసూలు అయింది. ఈ మూవీకి 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 98 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 78 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 48 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 34 లక్షలు, గుంటూరులో రూ. 45 లక్షలు, కృష్ణాలో రూ. 28 లక్షలు, నెల్లూరులో రూ. 20 లక్షలతో కలిపి.. రూ. 6.31 కోట్లు షేర్, రూ. 11.05 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిసి ఐదు రోజుల్లో రూ. 85 లక్షలు షేర్ వచ్చింది. వీటితో కలుపుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 7.16 కోట్లు షేర్, 13.05 కోట్లు రాబట్టింది. కాగా మంగళవారం మూవీ హిట్ అవ్వాలంటే మరో రూ. 5.84 కోట్లు షేర్ రాబట్టాలి.


End of Article

You may also like