Ponniyin Selvan-1 Review : “విక్రమ్, కార్తీ” పాన్-ఇండియన్ హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Ponniyin Selvan-1 Review : “విక్రమ్, కార్తీ” పాన్-ఇండియన్ హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

  • చిత్రం : పొన్నియన్ సెల్వన్-1 (PS-1)
  • నటీనటులు : విక్రమ్, త్రిష, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్ బచ్చన్.
  • నిర్మాత : మణిరత్నం, సుభాస్కరన్ అల్లిరాజా, సుహాసిని మణిరత్నం
  • దర్శకత్వం : మణిరత్నం
  • సంగీతం : ఏ ఆర్ రెహమాన్
  • విడుదల తేదీ : సెప్టెంబర్ 30, 2022

ponniyin selvan charecters remunaration

Video Advertisement

స్టోరీ :

సినిమా దాదాపు 1000 సంవత్సరాల క్రితం నాడు ఉన్న చోళుల కథతో ప్రారంభం అవుతుంది. సినిమా మొత్తం వారి మీద నడుస్తుంది. సుందర చోళ (ప్రకాష్ రాజ్) కొడుకులు ఆదిత్య కరికాలన్ (విక్రమ్), అరుల్మొళి వర్మన్ (జయం రవి), కూతురు కుందవై (త్రిష) వారి సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేశారు? వీరికి వందియ దేవుడు (కార్తీ) ఏ విధంగా సహాయం చేశాడు? అసలు నందిని (ఐశ్వర్య రాయ్ బచ్చన్) ఎవరు? వీరికి ఆమెకి ఉన్న సంబంధం ఏంటి? ఆదిత్య, నందిని ప్రేమకథ ఏంటి? వారిద్దరూ ఎందుకు కలవలేదు? చోళులు వారి సామ్రాజ్యాన్ని కాపాడుకున్నారా? ఇదంతా తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

ponniyin selvan charecters remunaration

రివ్యూ :

సినిమా కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా రూపొందింది. ఆ నవలని సినిమాలాగా తీయాలి అని ఎంతోమంది నటులు, దర్శకులు ఎన్నో సంవత్సరాల నుండి ప్రయత్నిస్తున్నారు. దర్శకుడు మణిరత్నం కూడా చాలా సంవత్సరాల నుండి ఇది సినిమాలాగా తీయాలి అని అనుకున్నారు. ఇప్పుడు దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా కథతో నడిచే సినిమా. సినిమాలో ఫైటింగ్స్, ఎలివేషన్స్ వీటన్నిటికంటే కూడా కథ బలంగా ఉండడం చాలా ముఖ్యం.

ponniyin selvan charecters remunaration

అలాంటి సినిమాల్లో ఒక సినిమా ఇది. కథ ఎంత ఒరిజినల్ గా ఉంటే తెరపై అంత బాగా కనిపిస్తుంది. అందుకే మణిరత్నం కథలో అసలు మార్పులు చేయలేదు. నవలలో ఎలా ఉంటే అలాగే తెరపై చూపించారు. పర్ఫామెన్స్ విషయానికి వస్తే, సినిమా మొత్తం చాలా పెద్ద పెద్ద నటులు ఉన్నారు. చిన్న పాత్రలు అయినా సరే ఆ పాత్రల కోసం చాలా గుర్తింపు ఉన్న నటులని తీసుకున్నారు. వారందరూ తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

ponniyin selvan charecters remunaration

కానీ సినిమాలో హైలైట్ గా నిలిచిన పాత్రలు మాత్రం విక్రమ్, కార్తీ పాత్రలు. ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కార్తీ తప్ప మిగిలిన ఎవరూ కనిపించరు. అంత బాగా నటించారు. హీరోయిన్లు త్రిష, ఐశ్వర్య రాయ్ చూడడానికి బాగున్నారు. నటన పరంగా కూడా పాత్రకి తగ్గట్టుగా నటించారు. ప్రముఖ నటులు తనికెళ్ల భరణి గారు రాసిన డైలాగ్స్ సినిమాకి సూట్ అయ్యేలాగా ఉన్నాయి. సినిమా మొత్తాన్ని కూడా నడిపించిన మరొక వ్యక్తి ఏఆర్ రెహమాన్.

mani ratnam shocking decision about ponniyan selvan

పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి పెద్ద హైలైట్ అయ్యాయి. అసలు ఏఆర్ రెహమాన్ సంగీతం లేకుండా ఈ సినిమా ఊహించుకోవడం కూడా కష్టం ఏమో. మరొక ప్లస్ పాయింట్ రవి వర్మన్ అందించిన సినిమాటోగ్రఫీ, అలాగే విఎఫ్ఎక్స్. నిజంగా సినిమా చూస్తుంటే అప్పటి కాలానికి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. సినిమా అంతా ఒక చారిరాత్మకమైన సినిమా అయినా కూడా మణిరత్నం టెంప్లేట్ లోనే నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా వెళుతూ ఉంటుంది. ఎక్కడ హై అనిపించే సీన్స్ ఉండవు.

ప్లస్ పాయింట్స్ :

  • నటీనటులు
  • మ్యూజిక్
  • విఎఫ్ఎక్స్
  • యాక్షన్

మైనస్ పాయింట్స్:

  • స్లో గా నడిచే స్క్రీన్ ప్లే

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ :

చోళుల చరిత్రని చెప్పే సినిమాలు ఇప్పటివరకు చాలా అరుదుగా వచ్చాయి. అంత గొప్ప గొప్ప నటులు ఉన్నా కూడా కథతో నడిచే సినిమా ఇది. ఏ సినిమాతోనూ పోల్చకుండా ఈ సినిమా చూస్తే పొన్నియన్ సెల్వన్ ప్రేక్షకులని అస్సలు నిరాశపరచదు.


End of Article

You may also like