రజనీకాంత్ మూవీ వల్ల నా కెరీర్ ముగిసిపోయింది.. వైరల్ అవుతున్న మనీషా కోయిరాల కామెంట్స్

రజనీకాంత్ మూవీ వల్ల నా కెరీర్ ముగిసిపోయింది.. వైరల్ అవుతున్న మనీషా కోయిరాల కామెంట్స్

by kavitha

Ads

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఆడియెన్స్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. 70 ఏళ్ల వయస్సులో కూడా ఈ సూపర్ స్టార్ వరుస చిత్రాలలో నటిస్తూ అలరిస్తున్నాడు.

Video Advertisement

ఇక రజనీకాంత్ కెరీర్ లో ఘన విజయం సాధించిన సినిమాలు ఎన్ని ఉన్నాయో,  తీవ్రంగా నిరాశపరిచిన చిత్రాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అయితే రజనీకాంత్ చిత్రం వల్ల తన కెరీర్ ముగిసిందంటూ ప్రముఖ బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె చైనా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
Manisha-Koirala-comments-rajinikanthబొంబాయి మూవీతో దక్షణాది ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్న మనీషా కోయిరాలా, కోలీవుడ్ లో తను నటించిన  చివరి పెద్ద సినిమా బాబా అని చెప్పారు. అప్పట్లో ఆ మూవీ భారీగా వైఫల్యం చెందిందని మనీషా తెలిపారు. ఆ మూవీ పై తను ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, బాబా చిత్రం ఫ్లాప్ అవడంతో అక్కడ తనకు మరే సినిమాలోను అవకాశం రాలేదని మనీషా తెలిపారు.
బాబా మూవీతోనే దక్షణాదిలో తన కెరీర్ ముగుస్తుందని అనుకుంటే, ఆఖరికి అదే జరిగిందని ఆమె అన్నారు. బాబా మూవీకి ముందు కొన్ని చిత్రాలలో నటించి, వాటికి ప్రశంసలు అందుకున్నానని చెప్పారు. అయితే రీరిలీజ్ లో బాబా విజయాన్ని సాధించిందని ఆమె వ్యాఖ్యలు చేశారు. బొంబాయి చిత్రంలో మొదట్లో నటించకూడదని భావించానని, కెరీర్ మొదటలో తల్లి పాత్రలు పోషించవద్దని ఎంతో మంది చెప్పారని ఆమె చెప్పుకొచ్చారు.అయితే సినిమాటోగ్రాఫర్ అయిన అశోక్ మెహతా తిట్టి మణిరత్నం చిత్రంలో అవకాశం వద్దనుకుంటే వెర్రిదానివని అన్నారని ఆమె తెలిపారు. ఆయన మాటలతో మనసు మార్చుకొని బొంబాయి మూవీలో చేశానని అన్నారు. బొంబాయి చిత్రంలో చేయడం ఇప్పటికీ ఎంతో సంతోషంగా ఉందని మనీషా తెలిపారు. ప్రస్తుతం ఆమె చెప్పిన విషయాలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. Manisha-KoiralaAlso Read: “అల వైకుంఠపురములో” సినిమాతో పాటు… హిందీలో “రీమేక్” అయ్యి ఫ్లాప్ అయిన 9 సూపర్ హిట్ తెలుగు సినిమాలు..!


End of Article

You may also like