Manjima Mohan: తన పై వస్తున్న ట్రోల్స్ గురించి మంజిమా రియాక్షన్ ఏమిటో తెలుసా?

Manjima Mohan: తన పై వస్తున్న ట్రోల్స్ గురించి మంజిమా రియాక్షన్ ఏమిటో తెలుసా?

by kavitha

Ads

Manjima Mohan: సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో బాడీ షేమింగ్ ఎక్కువైంది. అందులోను సెలబ్రెటీల పై కూడా ట్రోల్స్ చేస్తున్నారు. ఇటీవల గౌతమ్ కార్తీక్, మంజిమా మోహన్ పెళ్లి చేసుకున్న క్రమంలో మంజిమా మోహన్ పై నెట్టింట్లో దారుణంగా ట్రోల్ చేశారు.

Video Advertisement

తాజాగా మంజిమా మోహన్ ట్రోల్స్ పై స్పందించారు. మంజిమా మోహన్, గౌతమ్ కార్తీక్ గత 3 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. నవంబర్ 28, 2022న వీరి వివాహం చెన్నైలో కొంతమంది సన్నిహితుల మధ్య ఘనంగా వివాహ వేడుక జరిగింది. అయితే నటి మంజిమా మోహన్‌కు ట్రోల్స్‌ కొత్త కాదు. ఈ నేపధ్యంలో మంజిమా మోహన్ తన పై వస్తున్న ట్రోల్స్ గురించి స్పందించారు. నా వ్యక్తిగత జీవితం పై ఈ ట్రోల్స్ ప్రభావం చూపదని తెలిపారు.
Manjima-Mohan-2-telugu-adda బరువు తగ్గడం వృత్తిపరంగా అవసరం అయితే తాను బరువు తగ్గడానికి కూడా సిద్ధమేనని తెలిపారు. నేను ఖచ్చితంగా చేస్తానని తెలిపారు. నిజానికి మా పెళ్లిలో కూడా కొంత మంది దీని పై కామెంట్ చేశారు. ఇంతకు ముందు ఇలాగే ఉండేవారు. నా శరీరంతో ఇప్పుడు నేను కంఫర్టబుల్‌గా ఉన్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు బరువు తగ్గవచ్చని, ఫిట్‌నెస్‌ తో ఉన్నాను. నేను నా శరీరంతో సంతోషంగా ఉన్నాను. నేను లావుగా ఉండడం వల్ల ఇతరులకు ఎలా, ఎందుకు ఇబ్బందిగా ఉందో నాకు తెలియడం లేదు అని తెలిపింది.
manjima-mohan-telugu addaనటి మంజిమా మోహన్ కొన్ని నెలలుగా షూటింగ్స్ నుండి విరామం తీసుకుంది. పెళ్లి తరువాత మీరు సినిమాల్లో నటిస్తారా అన్న ప్రశ్నకు సినిమాలు చేయడానికి సిద్ధమేనని మంచి స్టోరీ కోసం చూస్తున్నానని, త్వరలోనే కొత్త సినిమా గురించి వివరాలను తెలియచేస్తానని చెప్పారు.ట్రోల్స్ పై  మంజిమా మోహన్ స్పందించిన నేపథ్యంలో ఇప్పటి నుండి అయిన ఆమె పై సోషల్ మీడియాలో ట్రోల్స్  ఆగుతాయో  చూడాలి మరి. మంజిమా మోహన్ కు తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న నటి. నాగచైతన్య తో నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.


End of Article

You may also like