Tollywood: కొన్ని రోజుల కిందట సూపర్ స్టార్ కృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. కృష్ణ మరణంతో మహేశ్‌ బాబు కుటుంబ సభ్యులు దుఃఖంలో మునిగిపోయారు. దానికి కొన్ని రోజుల క్రితం మహేశ్‌ తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు. ఈ ఏడాది మొదట్లోనే కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్‌ బాబు కూడా ఈ లోకాన్ని విడిచాడు. మహేశ్ బాబుకు ఈ ఏడాది అంతులేనటు వంటి విషాదాన్ని మిగిల్చింది. తెలుగు చిత్రసీమ కదలివచ్చి సూపర్‌స్టార్‌ కృష్ణకు నివాళులర్పించింది.

Video Advertisement

manjula insta post

సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు అయిదుగురు సంతానం ర‌మేష్ బాబు, మహేష్ బాబు, ప‌ద్మావ‌తి, మంజుల, ప్రియదర్శిని. నవంబర్‌22 న సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరా దేవిల పెళ్లిరోజు. ఆయన కూతురు మంజుల ఈ సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేసారు. కృష్ణ, ఇందిరా దంపతుల ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి, వారికి పెళ్లిరోజు శుభాక్షాంక్షలు తెలిపింది.

మంజుల తన సోషల్ మీడియా అకౌంట్ లో ఇలా రాసింది. ‘అమ్మానాన్నల వివాహబంధం స్వర్గంలో కొనసాగేంత గొప్ప బంధం. అమ్మ ఈలోకం నుంచి వెళ్లాక, నాన్న అమ్మను చాలా మిస్ అయ్యారను అనుకుంటున్నా. అందువల్లనేమో నాన్న మమ్మల్ని విడిచి, అమ్మ వద్దకే వెళ్ళాడు. వారి ఆత్మలు కూడా సహచరులేనేమో. అమ్మానాన్నల 60 ఏళ్ల వివాహబంధానికి మేం ఐదుగురు పిల్లలం. ఇంతటి ఉన్నతమైన వ్యక్తులు తల్లిదండ్రులు కావడం నిజంగా మేం చేసుకున్న అదృష్టం. వారు ఎక్కడున్నా వారి ప్రేమాభిమానాలు మాపై ఉంటాయని అనుకుంటున్నా. కనీసం పది శాతమైన స్వచ్ఛంగా ఉండడమే వారికిచ్చే ఉత్తమ బహుమతి అని భావిస్తున్నా. హ్యాపి వెడ్డింగ్‌ యానివర్సరీ అమ్మా నాన్నా’ అని ఎమోషనల్ అయ్యారు మంజుల.అయితే ఈ పోస్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది.