త్రిష గురించి చీప్ గా కామెంట్స్ చేసిన లియో నటుడు.. ఆమె స్పందన ఇదే?

త్రిష గురించి చీప్ గా కామెంట్స్ చేసిన లియో నటుడు.. ఆమె స్పందన ఇదే?

by Harika

Ads

లియో నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్నాయి. స్టార్ హీరోయిన్ త్రిష ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవడంతో సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు అలాగే త్రిష అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలి అంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. లియో మూవీలో త్రిష నటిస్తున్నారని తెలిసింది. నేను కూడా ఈ సినిమాలో నటించాను. కానీ సినిమాలో ఒక్క బెడ్‌-రూమ్ సీన్ అయినా ఉంటుందని అనుకున్నాను.

Video Advertisement

నేను ఇతర నటీమణులతో చేసినట్లే ఆమెను బెడ్‌-రూమ్‌కు తీసుకెళ్తానని అనుకున్నాను. ఇంతకుముందు సినిమాల్లో చాలా రే-ప్ సీన్లు చేశాను. సినిమాల్లో ఇది నాకు కొత్త కాదు. కానీ కశ్మీర్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్‌లో త్రిషను కనీసం నాకు చూపించలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మన్సూర్ అలీ ఖాన్‌. కాగా ఈ విషయంపై స్పందించిన త్రిష తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.. మన్సూర్ అలీ ఖాన్ నా గురించి నీచంగా, అసహ్యంగా మాట్లాడిన వీడియో నా దృష్టికి వచ్చింది. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది లైం-గికంగా, అగౌరవంగా, స్త్రీ ద్వేషపూరితంగా, అసహ్యకరంగా అనిపిస్తోంది.

అతని లాంటి నీచమైన వ్యక్తితో స్క్రీన్ స్పేస్‌ను ఇకపై ఎప్పుడూ పంచుకోను. నా మిగిలిన సినిమా కెరీర్‌లో కూడా ఇలా జరగకుండా చూసుకుంటాను. అతని లాంటి వారి వల్ల మానవాళికే చెడ్డపేరు వస్తుంది అని రాసుకుచ్చింది త్రిష. ప్రస్తుతం సోషల్ మీడియాలో మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో అలాగే త్రిష షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారాయి. కాగా త్రిష షేర్ చేసిన పోస్ట్ పై స్పందించిన అభిమానులు వెంటనే అతనిపై చర్యలు తీసుకోండి అలాంటి వ్యక్తులను శిక్షించాలి అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


End of Article

You may also like