“హీరోయిన్స్ తో పార్టీలు చేసుకుంటాడు..!” అంటూ… “చిరంజీవి” మీద “మన్సూర్ అలీ ఖాన్” కామెంట్స్..!

“హీరోయిన్స్ తో పార్టీలు చేసుకుంటాడు..!” అంటూ… “చిరంజీవి” మీద “మన్సూర్ అలీ ఖాన్” కామెంట్స్..!

by Mounika Singaluri

తమిళ్ లో గత 20 రోజులుగా వార్తల్లో నానుతున్న మన్సూర్ అలీ ఖాన్ త్రిషాల వివాదం రోజురోజుకు మలుపు తిరుగుతూ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ పైన పడింది. బురదలో రాయి వేస్తే ఆ బురద మన మీదే పడుతుంది అన్నచందంగా ఇది ఉంది. తాజాగా మన్సూర్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.

Video Advertisement

ఇప్పటికే ఈ వివాదంలో త్రిష, ఖుష్బూ చిరంజీవి పైన పరువు నష్టం దావా వేస్తానంటూ ప్రకటించిన మన్సూర్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి పైన సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచాడు.

mansoor ali khan reply to trisha comments

నేను మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నానని చిరంజీవితో సినిమాలు చేశానని ఆయన లాంటి స్టార్ నటుడు అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకోకుండా నాపై సామాజిక మాధ్యమాల్లో ఇలా వ్యాఖ్యలు చేయడం సరికాదు అని అన్నాడు. నాపై కామెంట్ చేసేటప్పుడు నన్ను అడిగి అసలు జరిగిందేంటో తెలుసుకుని మాట్లాడితే బాగుండేదని ఫైర్ అయ్యాడు.ఇక్కడితో ఆగకుండా చిరంజీవి నాటి కథానాయికలతో మాత్రమే పార్టీలు చేసుకుంటాడని, నన్ను ఎప్పుడు పిలవలేదని సంచలన కామెంట్లు చేశాడు.

the scene which chiranjeevi directed in bigboss movie..!! అది ఆయన ఇష్టమని, చిరంజీవి నిజమేంటో తెలుసుకాకుండా కామెంట్లు చేయడం బాధ అనిపించిందని అందుకే ఆయన పైన 20 కోట్లు, త్రిష, ఖుష్బూలపై చెరో పది కోట్లు పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించాడు. ఆ డబ్బును తమిళనాడులో ఇటీవల మద్యం తాగి మృతి చెందిన వారి కుటుంబానికి పంచుతానని అన్నాడు. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదన్నాడు. ఇప్పుడు మన్సూర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి.అయితే త్రిషకి మద్దతుగా తెలుగు, తమిళ ఇండస్ట్రీ నుండి చాలామంది ముందుకు వచ్చారు. వాళ్లందరిని వదిలేసి  ఒక్క చిరంజీవి పైనే ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది. మన్సూర్ అలీ ఖాన్ కావాలనే టార్గెట్ చేస్తున్నాడని చిరంజీవి అభిమానులు అంటున్నారు.

Watch Video:

https://twitter.com/Movies4u_Officl/status/1729369439412326645?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1729369439412326645%7Ctwgr%5E8d2dec95960951ca92bb44176373de7214ef96f7%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fprathidvani.com%2Fwp-admin%2Fpost.php%3Fpost%3D18025action%3Dedit

Also Read:కార్తీ “ఖైదీ” సినిమాలో ఈ పొరపాటు గమనించారా..? అది కూడా తెలుగులో మాత్రమే..!


You may also like

Leave a Comment