Ads
విద్యార్థి దశ అంటేనే ఒత్తిడితో కూడుతున్న వయసు. పరీక్షలు రాయడం ఒక రకమైన ఒత్తిడి అయితే ఫలితాలు వస్తున్నాయంటే చాలు మరో రకమైన ఒత్తిడి విద్యార్థులను, తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతుంది. చదువుల్లో ఉండే ఒత్తిడి కారణంగానే ఏటా వందల మంది విద్యార్థులు సూసైడ్స్ చేసుకుంటున్నారు.
Video Advertisement
తల్లిదండ్రుల పెట్టిన టార్గెట్ రీచ్ కాలేదనో.. కాలేమనో, అనుకున్న స్కోర్ రాలేదని ఇలా కారణమేదైనా విద్యార్థుల సూసైడ్స్ పెరుగుతున్నాయి. అయితే ఈ సమయాల్లో విద్యార్థులకు తల్లిదండ్రుల మద్దతు చాలా అవసరం. అయితే మహారాష్ట్రలో జరిగిన ఒక ఘటన అందరిని షాక్ కి గురిచేసింది. బీడ్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు మహారాష్ట్ర సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (10వ తరగతి ) పరీక్షలో అన్ని సబ్జెక్టులలో ఒక్కొక్కటి 35 మార్కులు సాధించి పట్టణంలో చర్చనీయాంశంగా మారాడు. ఆ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బీడ్‌లోని మజల్‌గావ్ తహసీల్‌లోని రామేశ్వర్ విద్యాలయట్ ఉమ్రీ విద్యార్థి ధనంజయ్ నఖాటే (14) ఇటీవలే పదవ తరగతి పరీక్షలు రాసాడు. తాజాగా ఈ పరీక్ష ఫలితాలు వచ్చాయి. ధనంజయ్ నఖాటే మరాఠీ, హిందీ, ఇంగ్లీష్, గణితం, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సైన్సెస్‌లలో ఒక్కొక్కరికి 35 మార్కులు తెచ్చుకున్నారని వ్యవసాయ కూలీ అయిన అతని తండ్రి నారాయణ్ తెలిపారు.
” ధనంజయ్ స్కూల్ కి రెగ్యులర్‌గా వెళ్ళేవాడు. నాతోపాటు పనులకు కూడా వచ్చేవాడు. సమయం దొరికినప్పుడల్లా చదువుకోవడానికి ప్రయత్నించేవాడు. ఈ ఫలితం తమను ఆశ్చర్యానికి గురి చేసింది. అతను పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడం సంతోషంగా ఉంది. ధనంజయ్ ఇంకా చదవాలని నేను కోరుకుంటున్నాను, అతను అందుకు అంగీకరిస్తే, ఉమ్రీకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మజల్‌గావ్‌లోని జూనియర్ కళాశాలలో అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తాను.” అని అతడి తండ్రి నారాయణ్ తెలిపారు.
ధనంజయ్ ఫలితాలు రాగానే గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. బాలుడికి ఇద్దరు పెద్ద తోబుట్టువులు ఉన్నారు – వారిలో ఒకరు 12వ తరగతి ఉత్తీర్ణులయ్యారు, మరొకరు 11వ తరగతి తర్వాత చదువును విడిచిపెట్టారు. అయితే మార్కుల కోసం తల్లిదండ్రులే పిల్లల్ని వేధిస్తున్న ప్రస్తుత సమాజంలో.. ధనంజయ్ తల్లిదండ్రులు అతడి విజయ సంబరాలు చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
https://www.instagram.com/reel/CtMEPNXs7PZ/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D
End of Article