నటి శ్రీరెడ్డి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. ఆమె న్యూస్ రిప్రజెంటేటివ్ గా తన కెరియర్ ని మొదలు పెట్టి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈమె నటిగా చాలా సినిమాల్లో కూడా నటించింది. అనంతరం క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. ఆనాటి నుంచి ఏదో ఒక వివాదంతో వార్తల్లోకి ఎక్కుతుంది శ్రీరెడ్డి. ఆమె ఎప్పుడూ ఇండస్ట్రీలోని రాజకీయాల గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ చాలా గుర్తింపు తెచ్చుకున్నారు.

Video Advertisement

కానీ ఈ మధ్య కాలంలో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి వంటకాలకు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇందులో తెలంగాణ మరియు ఆంధ్ర రుచికరమైన ఆహార పదార్థాలను తయారు చేసి ఆ వీడియోలను అభిమానులతో పంచుకుంటోంది శ్రీ రెడ్డి. ఆమె తాజాగా మరో వీడియోతో ఫ్యాన్స్ ముందుకు వచ్చింది. ఎప్పుడూ బోల్డ్ గా, గ్లామర్ గా కనిపించే శ్రీరెడ్డి, ప్రస్తుతం చీరకట్టుతో షాక్ ఇచ్చింది.

చీరకట్టు అంటే మామూలు చీరకట్టు కాదండోయ్ పెళ్లి కూతురు గెటప్ వేసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అనంతరం ఆమె మాట్లాడుతూ వేసవి కాలం కావడంతో ఎన్నో వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే చాలామంది పెళ్లి కూతుర్లు ఎంతో అందంగా ముస్తాబు అవుతారు. అందుకే నేను కూడా పెళ్లి కూతురులా ముస్తాబు అవ్వాలని అనుకున్నా అంటోంది శ్రీరెడ్డి.

నా జీవితంలో నేను పెళ్లి ఎలాగూ చేసుకోను, కనీసం పెళ్లికూతురుగా అయినా తయారవుతా అని, అచ్చం పెళ్లికూతురు చీర కట్టి, నగలు ధరించి చూడముచ్చటగా ముస్తాబయింది శ్రీరెడ్డి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పెళ్లికూతురులా ముస్తాబైన శ్రీరెడ్డిని చేసుకోబోయే వరుడు ఎవరు అంటూ కామెంట్లు చేస్తున్నారు.