యానిమల్ సినిమాలో కులాంతర వివాహం సీన్ ని గమనించారా..? దీని గురించి డైరెక్టర్ ఏం చెప్పారంటే..?

యానిమల్ సినిమాలో కులాంతర వివాహం సీన్ ని గమనించారా..? దీని గురించి డైరెక్టర్ ఏం చెప్పారంటే..?

by kavitha

Ads

ద‌ర్శ‌కుడు సందీప్ వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన ‘యానిమల్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. హై స్టాండార్డ్స్ తో, భారీ తారాగ‌ణంతో రూపొందిన ఈ సినిమా దాదాపు రూ. 850కోట్ల కలెక్షన్స్ సాధించి, ఈ ఏడాది అత్యధిక విజయం సాధించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది.

Video Advertisement

అయితే ఈ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో, అంతే స్థాయిలో విమర్శలు వచ్చాయి. సినిమాలోని కొన్ని అంశాలు వివాదాస్పదం అయ్యాయి. వీటి పై తాజాగా ద‌ర్శ‌కుడు సందీప్ వంగా స్పందించాడు. ఒక ఇంటర్వ్యూలో వీటి గురించి వివరణ ఇచ్చాడు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ మూవీలో అనిల్ కపూర్, బాబీ డియోల్, సలోని బాత్రా, సురేష్ ఒబెరాయ్, తృప్తీ డిమ్రీ, శక్తి కపూర్ వంటివారు కీలక పాత్రలలో నటించారు. యానిమ‌ల్ విజయంతో సందీప్ వంగా పై  ప్ర‌శంస‌లు కురిసాయి. ఇక ఈ మూవీ పై వచ్చిన విమ‌ర్శ‌లన్ని బ్లాక్ బస్టర్ గా నిలవడంతో వెన‌క్కి వెళ్లాయి. అయితే విమర్శలు వచ్చిన కొన్ని అంశాల గురించి తాజాగా సందీప్ వంగా స్పందించాడు.
ఈ మూవీలో చూపించిన ర‌ణ‌బీర్ కపూర్, ర‌ష్మికల కులాంత‌ర వివాహం కావాలని పెట్టింది కాదని వంగా చెప్పారు. రణబీర్, రష్మికలు ఫ్యామిలీ మెంబర్స్ ముందే లిప్ లాక్  గురించి అడుగాగ, “రాక్‌ మ్యూజిక్ లో ఒక నిర్లక్ష్యం ఉంది. బ్యాక్ గ్రౌండ్ లో రాక్ ప్లే అవుతుండడంతో తమ ఆవేశాన్ని బయటపెడుతున్నట్లు అనిపిస్తుంది. అందులో కాస్త నిర్లక్ష్యం కూడా ఉంది” అన్నారు.
ఇక బాబీ డియోల్ ను ముస్లింగా చూపించడం పైన సందీప్ వంగా స్పందించారు. ”ఇస్లాం మరియు క్రైస్తవ మతంలోకి ఎక్కువ మంది మారడం చూస్తున్నాం. కానీ హిందూ మతంలోకి ఎవరూ మారడం చూడలేదు. అందువల్ల దీన్ని వాడాలని భావించాను. ఇస్లాంలో ఒకరి కన్నా ఎక్కువ‌మంది భార్యలు ఉంటారు. ఆ ఫ్యామిలీలో ఒకరి కన్నా ఎక్కువ  దాయాది క్యారెక్టర్లకు ఛాన్స్ ఉంది. డ్రామా కూడా పెద్దగా ఉంటుంది. ఆ కారణం వల్లే తప్ప ముస్లింను చెడుగా చూపించాలని భావించలేదు” అంటూ సందీప్ వంగా చెప్పుకొచ్చారు.

Also Read: KGF లో “రాకీ భాయ్” పాత్ర కోసం… మొదట అనుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?


End of Article

You may also like