ఆయన నాకు విడాకులు ఇవ్వడంకంటే ఈ విషయమే ఎక్కువగా బాధించింది.!

ఆయన నాకు విడాకులు ఇవ్వడంకంటే ఈ విషయమే ఎక్కువగా బాధించింది.!

by Mohana Priya

పెళ్లయిన తర్వాత అభిప్రాయ భేదాలు వచ్చి లేదా ఇంకా ఇతర ఏదైనా కారణాల వల్ల జంటలు విడిపోవడం అనేది సహజం. అలా అలా ఒక జంట విడిపోయారు. కానీ విడిపోయిన దానికంటే కూడా మరొక విషయం తనని ఇంకా ఎక్కువ బాధించింది అని ఆ యువతి చెప్పింది. ఆ యువతి కథ ఏంటో తన మాటల్లోనే చూద్దాం. “నా పేరు దీప్తి. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాను. నాకు ఒక వయసు వచ్చిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు నాకు ఒక పెళ్లి సంబంధం చూశారు. అతని పేరు కార్తీక్. నాకెందుకో అతను బాగా నచ్చాడు. అతని మాట తీరు అదంతా నాకు చాలా బాగా అనిపించింది.

Video Advertisement

marriage story of a woman

తనకి కూడా నేను నచ్చడంతో మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. నాకు పెద్దగా స్నేహితులు ఎవరూ లేరు. ఉన్నది ఒకటే ఫ్రెండ్. తను కూడా నా స్కూల్ ఫ్రెండ్. తన పేరు స్వాతి. చిన్నప్పట్నుంచి నాకు సంబంధించిన ప్రతి విషయం నేను స్వాతికి చెప్తాను. స్వాతి కూడా తనకు సంబంధించిన ప్రతి విషయం నాకు చెప్తుంది. కార్తీక్ నాకు నచ్చిన తర్వాత ఈ విషయం నేను మొదటిగా చెప్పింది స్వాతికే. పెళ్లయిన తర్వాత కొద్దినెలలవరకూ మేమిద్దరం బానే ఉన్నాం. తర్వాత నుండి మెల్లగా మనస్పర్ధలు రావడం మొదలయ్యాయి. అవి పెద్దవై గొడవలు మొదలయ్యాయి.

Things that a mother should tell her son before getting married

ఇప్పటివరకు జరుగుతున్న ఈ విషయాలు ఏవి నేను ఎవరికీ చెప్పలేదు. స్వాతికి కూడా. కానీ ఒకరోజు గొడవ బాగా పెద్దది అయ్యేసరికి నా బాధ ఎవరితో చెప్పాలో తెలియక స్వాతికి ఫోన్ చేసి ఏడ్చేశాను. స్వాతి కంగారు పడింది. వెంటనే నా దగ్గరికి వచ్చేసింది. కార్తీక్ ని, నన్ను కూర్చోబెట్టి మాట్లాడింది. అప్పటి నుంచి మెల్లగా మళ్లీ నేను, కార్తీక్ మామూలు అయిపోయాము. ఆ సమయంలో స్వాతి నాకు దేవతలా కనిపించింది. ఇలాంటి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నందుకు చాలా ఆనందంగా అనిపించింది. తర్వాత నేను, కార్తీక్ బాగానే ఉన్నాం. గొడవలు కూడా తగ్గాయి. అంతా బాగానే నడుస్తుంది అనుకున్న సమయానికి ఒక రోజు కార్తీక్ సడన్ గా నేను ఊహించని మాటలు మాట్లాడాడు.marriage story of a woman

నేను తనకి మంచి స్నేహితురాలు మాత్రమే కానీ, మా ఇద్దరికీ కలిసి ఉండటం అనేది కరెక్ట్ కాదు అని అన్నాడు. తనకి ఇంక ఎప్పటికీ నా మీద భార్య అనే ఫీలింగ్ అయితే రాదు అని నా మొహం మీద చెప్పేశాడు. ఇన్నాళ్ళు నేనున్నది ఇలాంటి వ్యక్తి తోనా అని నామీద నాకే కోపం వచ్చింది. “అలాంటప్పుడు ఇన్ని సంవత్సరాలు కాపురం ఎందుకు చేసావు?” అని నేను కూడా గట్టిగానే మాట్లాడాను. నాకు ఇంకా కార్తీక్ తో ఒక్క క్షణం కూడా ఉండాలి అనిపించలేదు. అంతే కాకుండా ఈ విషయంలో తల్లిదండ్రులని కానీ, కార్తీక్ తల్లిదండ్రులని కానీ కలగచేసుకోవద్దు అని, సర్ది చెప్పడానికి ప్రయత్నించద్దు అని, తనకి నా మీద ఇష్టం లేనప్పుడు మేము ఇద్దరం కలిసి ఉండి కూడా ఉపయోగం లేదు అని గట్టిగా చెప్పేసాను. వెంటనే ఇద్దరం డివోర్స్ కి అప్లై చేసి విడిపోయాం.

marriage story of a woman

ఈ సమయంలో కూడా నాకు మానసికంగా నా స్వాతి ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. కానీ అప్పుడప్పుడు కార్తీక్ ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి అనిపించేది. మేము విడిపోయినా కానీ కార్తీక్ నన్ను తన ఫేస్ బుక్ లో అన్ ఫ్రెండ్ చేయలేదు. నేను కూడా కార్తీక్ ని అన్ ఫ్రెండ్ చేయలేదు. మధ్యలో ఒకసారి కార్తీక్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఏదో ఒక ట్రిప్ కి వెళ్ళాడు. బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు అనుకున్నా. నాకు కూడా అలా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనిపించింది. ఇదే విషయం గురించి స్వాతిని అడిగితే తనకి లీవ్ దొరకడం కుదరదు అని చెప్పింది. అంతే కాకుండా మంత్ ఎండ్ అవ్వడంతో వర్క్ కూడా చాలా హెవీగా ఉంది అని చెప్పింది.marriage story of a woman

దాంతో నేను ఎక్కువగా తనని డిస్టర్బ్ చేయలేదు. ఒకరోజు కార్తీక్ తన ఫేస్ బుక్ లో ఏవో ఫోటోలు పోస్ట్ చేసినట్టు నోటిఫికేషన్ వచ్చింది. ఏదో ఒక రెస్టారెంట్లో కూర్చుని ఉన్నాడు. తన ముందు ఒక చెయ్యి పెట్టి ఉంది.  ఆ వ్యక్తి కార్తీక్ కి ఆపోజిట్ లో కూర్చుని ఫోటో తీశారు. కొంచెం పరిశీలించి చూస్తే ఆ చెయ్యి ఎవరితో అమ్మాయిది అని అర్థం అయ్యింది. ఈ కారణంగానే నన్ను వదిలేసాడు అని అప్పుడు అర్థం అయింది. సరే ఎవరో ఒకళ్ళతో బానే ఉన్నాడు అనుకొని నేను ఇంకా లాగౌట్ చేద్దాం అని అనుకుంటూ ఉంటే మళ్ళీ ఒక్కసారి నా చూపు ఆ చెయ్యి మీద పడింది.

marriage story of a woman

ఆ చెయ్యి నేను ఎక్కడో చూసినట్టు ఉంది. చేతి మీద అ ఒక బటర్ ఫ్లై టాటూ ఉంది. ఆ టాటూ ఎవరికి ఉంటుందో నాకు గుర్తు వచ్చింది. నేను మళ్ళీ స్వాతి కి ఫోన్ చేశాను. అది ఫోన్ ఎత్తలేదు. నాకు ఇంక ఏం చేయాలో తెలియక, వేరే మార్గం లేక స్వాతి ఆఫీస్ కి వెళ్ళాను. రిసెప్షన్ లో స్వాతి గురించి అడిగాను. అక్కడ రిసెప్షనిస్ట్ చెప్పిన మాటలకి నాకు గుండె ఆగినంత పనయ్యింది. స్వాతి వారం రోజులు లీవ్ తీసుకుంది అని ఆ రిసెప్షనిస్ట్ చెప్పింది. కార్తీక్ తో ఉన్నది మరెవరో కాదు స్వాతి. నా ప్రాణ స్నేహితురాలు అనుకున్న స్వాతి.

marriage story of a woman

కార్తీక్ నాతో విడిపోయింది స్వాతి కోసమా? ఇన్ని రోజులు స్వాతి మా ఇంటికి వస్తూ ఉంటే నా కోసం అనుకున్నాను. కానీ తను వచ్చేది కార్తీక్ కోసం. నాకు కార్తీక్ డివోర్స్ ఇవ్వడంకంటే ఈ విషయమే ఎక్కువగా బాధించింది. ఇంక నమ్మక ద్రోహం నేను భరించలేను అనిపించింది. మళ్లీ తనతో, కార్తీక్ తో మాట్లాడి కూడా ఉపయోగం లేదు. అందుకే నేను మాట్లాడలేదు. స్వాతికి మాత్రం, “నేను నేను ఇంత నమ్మాను, కానీ నువ్వు నాకు ఇంత ద్రోహం చేస్తావని అనుకోలేదు” అని ఒక మెసేజ్ పెట్టి తర్వాత అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో, ఫోన్ లో తన కాంటాక్ట్ బ్లాక్ చేసేసాను.

marriage story of a woman

ఇంక నాకు ఇక్కడ ఉండాలని అనిపించలేదు. వేరే ఎక్కడైనా ప్రశాంతంగా కొత్త జీవితం మొదలు పెట్టాలి అనిపించింది. ఇన్నాళ్ళు నేను పడుతున్న బాధను చూసిన నా తల్లిదండ్రులు కూడా నన్ను ఏమీ అనలేదు. నేను ఇంకా ఆఫీస్ లో మాట్లాడుకొని వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయి ఒక్కదాన్నే ప్రశాంతంగా ఉంటున్నాను. నిజంగా చెప్పాలంటే నాకు ఇలాగే బాగుంది. మానసిక ప్రశాంతత దొరికింది” అని ఆ యువతి రాశారు.

NOTE: images used in this article are just for representative purpose. But not the actual characters.


You may also like