Ads
ఇండియాలో అగ్ర దర్శకులలో ఒకరిగా నిలిచిన తెలుగు దర్శకుడు ‘ఎస్ ఎస్ రాజమౌళి’. బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా వైడ్ గా పాపులర్ అయిన జక్కన్న, ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తాను చాటి, గుర్తింపును పొందారు.
Video Advertisement
ఆ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ వచ్చిన విషయం తెలిసింది. ఈ సినిమాకి ఎన్నో అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. జక్కన్న సినిమాలలో ఛత్రపతి సినిమాని మాస్ ఆడియెన్స్ ను మరచిపోలేరని చెప్పవచ్చు. అయితే ఆ మూవీలో ముందుగా అనుకున్నది ప్రభాస్ ని కాదట. టాలీవుడ్ స్టార్ హీరో రిజెక్ట్ చేశారట. మరి ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..
ప్రభాస్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా ఛత్రపతి. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, జక్కన్న కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా కూడా ఇదే. ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రియ నటించింది. అయితే ఈ మూవీని రాజమౌళి ముందుగా మాస్ మహారాజ రవితేజతో చేయాలని భావించడట.
అయితే సంవత్సరానికి నాలుగైదు చిత్రాలు చేసే రవితేజ డేట్స్ ఇతర సినిమాలకి ఇవ్వడంతో డేట్స్ లేక ఈ సినిమాని ప్రభాస్ తో చేయాలని రాజమౌళి అనుకున్నాడు. కానీ ప్రభాస్ దగ్గరకి వెళ్ళడానికి కాస్త ఆలోచించాడట. దానికి కారణం గతంలో రాజమౌళి ప్రభాస్ స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి చిత్రాలను రిజెక్ట్ చేసాడు. ఈ మూవీని కూడా రిజెక్ట్ చేస్తాడేమో అని అనుకున్నాడట.
అయితే ఒకరోజు ప్రభాస్ పుట్టినరోజు పార్టీకి తెలుగు స్టార్ హీరోలు, నిర్మాతలను కూడా ఆహ్వానించాడట. ఆ ఆహ్వానం తనకు కూడా రావడంతో రాజమౌళి పార్టీకి వెళ్ళినపుడు, తన దగ్గర ఒక కథ ఉందని, వింటావా అని ప్రభాస్ ని అడగాడట. తరువాతి రోజు చెప్పమని అన్నాడంట. రాజమౌళి తరువాతి రోజే ప్రభాస్ ఇంటికి వెళ్లి కథ చెప్పడం, ప్రభాస్ కి నచ్చడంతో ఒకే చెప్పారంట.
Also Read: 20 కోట్లతో తీసిన సినిమా… 72 కోట్లు వసూలు చేసింది..? అంతగా ఏముంది ఈ సినిమాలో..?
End of Article