jr ఎన్టీఆర్ హోస్ట్ గా గతం లో బిగ్ బాస్ షో చేసిన సంగతి తెలిసిందే మా టీవీ లో ప్రసారమైన ఆ షో బంపర్ హిట్ అవ్వడమే కాకుండా టిఆర్పి రేటింగ్స్ లో కొత్త రికార్డు ను సైతం సొంతం చేసుకుంది. meelo evaru koteeswarudu show ఇక మాటీవీలో ప్రసారం అయ్యే మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం కి గతం లో నాగార్జున, చిరు లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన సంగతి తెలిసందే. మీలో ఎవరు కోటీశ్వరుడు లేటెస్ట్ సీజన్ జెమినిలో ప్రసారం కానుంది ఈ సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు.
Video Advertisement

meelo-evaru-koteswarudu-episode-promo
ఆగష్టు 22 తారీఖున ప్రసారం అయ్యే ఈ షో మొదటి ప్రోమోను విడుదల చేసారు నిర్వాహకులు. ఫస్ట్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ గెస్ట్ గా రానున్న ఈ షో కి… ఎపిసోడ్ ప్రోమోలో ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. మిస్టర్ గెస్ట్ హోస్ట్ ని నేను అని ఎన్టీఆర్ అనగా..ఓరిని అవునా అని రామ్ చరణ్ అంటారు. ఎన్టీఆర్ రామ్ చరణ్ లు ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఆర్ ఆర్ ఆర్ చివరి షెడ్యూల్ లో ఉన్నారు. ఈ సినిమాని అక్టోబర్ 13 న విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ఇప్పటికే సన్నాహాలు చేస్తుంది.ఇటీవలే విడుదల అయినా దోస్తీ సాంగ్ సూపర్ హిట్ అవ్వడంతో చిత్ర యూనిట్ సంతోషంగా ఉన్నారు.