Ads
ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి పేరు ఆర్య. ఆమె తల్లి ఓ ప్రైవేట్ రెసెప్షనిస్ట్ గా పనిచేస్తున్నారు. తండ్రి పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నారు. వారికొచ్చే ఆదాయం అంతంతమాత్రమే అయినా కూతురు చదువు విషయంలో ఇద్దరూ రాజీ పడలేదు. ఆమెను ఉన్నతంగా చదివించి మంచి పొజిషన్ లో నిలబెట్టాలని భావించారు. అందుకు తగ్గట్లే కూతురు ఆర్య కూడా చదువు పట్ల చాలా శ్రద్ధ కనబరిచేది.
Video Advertisement
చిన్నప్పటినుంచి చదువులో చురుకుగా ఉన్న ఆర్య ఐఐటి కాన్పూర్ లో పెట్రో కెమికల్ ఇంజనీరింగ్ లో ఎంటెక్ సీటు సంపాదించింది. ఓ పెట్రోల్ బంక్ కూతురు పెట్రోల్ కెమికల్ ఇంజనీరింగ్ లో సీటు సంపాదించడం తో ఆమె గురించిన వార్త వైరల్ అయింది. ఈ తండ్రి కూతుళ్ళ స్టోరీని పెట్రోల్ బంక్ మేనేజర్ ట్వీట్ చేసారు. అంతే కాదు తన సన్నిహితులు, కొలీగ్స్ ఉన్న వాట్సాప్ గ్రూప్ లలో కూడా షేర్ చేసారు.
దీనితో ఈ స్టోరీ వైరల్ అయింది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి, ప్రముఖ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఈ ట్వీట్ ను రీట్వీట్ చేసి ఈ తండ్రి కూతుళ్లను అభినందించారు. టెన్త్, ఇంటర్ లలోనే 98 శాతం మార్కులు సాధించిన ఆర్య 78.3 శాతంతో పెట్రో కెమికల్ ఇంజనీరింగ్ ను పూర్తి చేసింది. ఐఐటి కాన్పూరు లో కూడా సీటు సంపాదించడం తో ఆ తల్లితండ్రుల ఆనందానికి హద్దుల్లేవు. అందరు ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ వైపు పరిగెత్తి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లు అయిపోవాలనుకునే ఈరోజుల్లో ఈ అమ్మాయి తన తండ్రి కోసం పెట్రో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేయాలనుకుంటోంది. అంతే కాదు.. పెట్రో కెమికల్ ఇంజనీర్ గా లైఫ్ లో స్థిరపడాలని అనుకుంటోంది.
ఆర్య తండ్రి మాట్లాడుతూ.. మా ఇద్దరి సంపాదన అంతంత మాత్రమే అయినా, తన చదువు విషయం లో రాజీ పడాలని అనుకోలేదు. ఇంకా తన హాస్టల్, ఇతర ఫీజులు చెల్లించాల్సి ఉంది. వీలైనంత తొందరలో వీటిని కూడా పూర్తి చేసేస్తాం. నా కూతురుని పెట్రో కెమికల్ ఇంజనీర్ గా చూడాలని అనుకున్నాం. నేను 2005 నుంచి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లోనే పనిచేస్తున్నా.. మా సంస్థ లోనే తాను కెమికల్ ఇంజనీర్ అయితే.. అంతకంటే ఆనందం మరొకటి ఉండదు” అంటూ ఆ తండ్రి ఎమోషనల్ అవుతున్నాడు.
Let me share an inspiring story of Arya, daughter of #IndianOil's customer attendant Mr. Rajagopalan. Arya has made us proud by securing entry in IIT Kanpur.
All the best and way to go Arya! pic.twitter.com/GySWfoXmQJ
— ChairmanIOC (@ChairmanIOCL) October 6, 2021
End of Article