Ads
సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. వారిలో ఒకే కుటుంబానికి చెందిన చాలా మంది హీరోలు ఉన్నారు. సినిమా నేపథ్యంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. తర్వాత వాళ్ళని వాళ్ళు నిరూపించుకొని వాళ్లకు ఒక గుర్తింపు సంపాదించుకున్నారు. ఏదేమైనా సరే బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఒక సమయం వరకు మాత్రమే అది ఉపయోగపడుతుంది.
Video Advertisement
ఆ తర్వాత అందరూ కష్టపడాల్సిందే. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా వారికంటూ ప్రతిభ ఉంటే మాత్రమే ప్రేక్షకులు వాళ్ళని అంగీకరిస్తారు. అలా ఇండస్ట్రీలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. వారిలో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో అడుగు పెట్టినా కూడా, తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు.
మెగా ఫ్యామిలీ అంటే అటు కొణిదల ఫ్యామిలీ, ఇటు అల్లు ఫ్యామిలీ. ఈ రెండు కుటుంబాలు వస్తాయి. ఈ రెండు కుటుంబాల్లో కలిపి ఎంతో మంది హీరోలు వచ్చారు. 1950 లో అల్లు రామలింగయ్య గారు సినీ కెరీర్ మొదలు పెట్టారు. ఆ తర్వాత చిరంజీవి కూడా తన కెరీర్ మొదలు పెట్టారు. అల్లు రామలింగయ్య గారి కూతురు సురేఖని, చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేశారు. దాంతో రెండు కుటుంబాలు ఒకటి అయ్యాయి. అప్పుడు ఆ కుటుంబం నుండి ఉన్న నటులు అల్లు రామలింగయ్య గారు, చిరంజీవి. ఆ తర్వాత నాగబాబు సినిమాల్లోకి వచ్చారు. అల్లు అరవింద్ నిర్మాతగా అడుగు పెట్టారు.
తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా అడుగు పెట్టారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ వారి తర్వాత అల్లు శిరీష్, వరుణ్ తేజ్, నిహారిక కొణిదెల నటులుగా తమ కెరీర్ మొదలు పెట్టారు. మరొక పక్క అల్లు శిరీష్ వ్యాపారాలు కూడా చూసుకుంటారు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదల ఫ్యాషన్ డిజైనర్ గా రాణిస్తున్నారు. ఇటీవల సుస్మిత కొణిదల కూడా ప్రొడ్యూసర్ అయ్యారు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా హీరోలు అయ్యారు. అయితే, మెగా కుటుంబానికి చెందిన వారు సినిమాల్లో మాత్రమే కాకుండా, ఇతర రంగాల్లో కూడా రాణిస్తున్నారు.
ఈ కుటుంబంలో చాలా మంది వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. దాంతో ఇప్పుడు వీళ్ళ ఆస్తి మొత్తం 6000 కోట్లు ఉంటుంది అని సమాచారం. ఈ కుటుంబంలో 4 స్టార్ హీరోలు ఉన్నారు. మిగిలిన వాళ్ళు యంగ్ హీరోలు. నాగబాబు కూడా అప్పుడప్పుడు సహాయ పాత్రల్లో నటిస్తూ ఉన్నారు. అంతే కాకుండా, కొణిదల ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, అంజనా ఆర్ట్స్, గీతా ఆర్ట్స్ కూడా వీరి కుటుంబానికి చెందిన నిర్మాణ సంస్థలు. ఈ సంస్థల నుండి వారి కుటుంబాలకు చెందిన హీరోల సినిమాలు మాత్రమే కాకుండా ఇతర హీరోల సినిమాలను కూడా నిర్మిస్తున్నారు.
ALSO READ : సినిమా రిలీజ్ అయిన 15 ఇయర్స్ తర్వాత తెలిసిందిగా.? “ఓయ్” అంటే అర్ధం ఇదా.?
End of Article