కాజల్ అగర్వాల్ మొన్ననే పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఆమె చాలా సంతోషంతో ఉన్నారు. ప్రెగ్నెన్సీతో ఉన్న సమయంలో సోషల్ మీడియాలో ప్రతిరోజు ఫోటోలను షేర్ చేస్తూ తన అనుభూతిని పంచుకున్నారు. తన భర్త గురించి కూడా సోషల్ మీడియాలో చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యారు కాజల్ అగర్వాల్.

Video Advertisement

సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్ గా ఉంటూ ప్రతిరోజు ప్రెగ్నెన్సీ ఫోటోలు షేర్ చేస్తున్న ఆమె ఆచార్య మూవీ పై ఎందుకు దృష్టి మళ్ళించడం లేదు. కనీసం సినిమా వైపు కూడా చూడడం లేదు.. కారణం ఏంటో చూద్దాం..!! ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆచార్య మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గురించి వైరల్ అవుతోంది.

ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తారు అనే టాపిక్ ట్రెండింగ్ గా మారింది.. ఇదిలా ఉండగా అభిమానుల మనసు హీరోయిన్ కాజల్ వైపు మళ్ళింది.. అందులో ప్రధాన పాత్రలో హీరోయిన్ గా చేసినా ఆమె సినిమా ప్రమోషన్ లో పాల్గొంటారా లేదా అనేది ఆలోచిస్తున్నారు.

ఓకే దీన్ని కూడా పక్కన పెడితే, ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కాజల్ కనీసం ఆచార్య ట్రైలర్ ని కూడా సోషల్ మీడియాలో ట్యాగ్ చేయలేదని మెగా ఫ్యాన్స్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు నెలలుగా ఆమె కనీసం సినిమాలతో టచ్ లో కూడా లేదని,

కొన్ని సినిమాలను ఒప్పుకున్న వాటిని క్యాన్సల్ చేశారని తెలుస్తోంది. ఈ తరుణంలో దుల్కన్ మూవీ హే సినామికన్ ను సోషల్ మీడియాలో ప్రమోట్ చేసిన ఆమె, ఆచార్య మూవీని కనీసం కూడా పట్టించుకోవడం లేదు. మరి ఎందుకు ఆమె ఇలా చేస్తోంది. సినిమా విషయంలో ఆమె ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొందా..

గతంలో ఆచార్య షెడ్యూలుకు అటెండ్ అవ్వకుంటే డైరెక్టర్ ఇబ్బంది పెట్టారని విమర్శలు కూడా వస్తున్నాయి. ట్రైలర్ లో హీరోయిన్ పూజా హెగ్డే అన్నిసార్లు కనిపించి, కాజల్ ఒక్కసారి కూడా లేకపోవడంపై ఫ్యాన్స్ తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు.