మెగాస్టార్ చిరంజీవి మరో సారి డ్యూయల్ రోల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తాజా సమాచారం. మెగాస్టార్ చిరంజీవి సినిమా గురించి అభిమానులు తెగ ఎదురు చూస్తూ ఉంటారు .అయితే ఈ సారి మెగాస్టార్ మళ్ళీ ప్రేక్షకులకు కన్నుల పండుగ చేయనున్నారు .
chiranjeevi
చిరంజీవి రీసెంట్ గా ఖైదీ నెంబర్ 150 లో డ్యూయెల్ రోల్ తో అందరినీ అలరించారు .తాజాగా బాబీ దర్శకత్వం లో మళ్ళీ డ్యూయెల్ రోల్ తో మన ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది .అయితే ఈ సినిమా లో తండి- కొడుకు రోల్స్ చేస్తునట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. లూసిఫెర్ రీమేక్ పూర్తి అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉంది.