అదిరిపోయే డ్యాన్స్ చేసిన రాధ.. హగ్ ఇచ్చిన మెగాస్టార్ చిరు.. వీడియో వైరల్‌

అదిరిపోయే డ్యాన్స్ చేసిన రాధ.. హగ్ ఇచ్చిన మెగాస్టార్ చిరు.. వీడియో వైరల్‌

by kavitha

Ads

80′ s Reunion: 80s రీయూనియన్‌ ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా నటీనటుల ఆత్మీయ సమ్మేళనం చాలా వేడుకగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈసారి జాకీ ష్రాఫ్‌ ముంబయిలోని తన నివాసంలో ఏర్పాటు చేశారు.

Video Advertisement

తాజాగా ఈ వేడుకలకు సంబంధించిన ఒకటి వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ వీడియోలో ఒకప్పటి అగ్రకథానాయిక రాధ చేసిన డ్యాన్స్‌కు మెగాస్టార్‌ చిరంజీవి ఫిదా అయ్యారు.

ఈ రీయూనియన్‌లో 80ల్లో వెండితెరపై సందడి చేసిన దక్షిణాది, ఉత్తరాది నటీ నటులందరూ కలిశారు. నటీనటులందరూ ఒకప్పటి హిట్‌ సాంగ్స్‌కు డ్యాన్స్‌లు చేసారు. అయితే రాధ సైతం ‘సంజ హై ముజె’ అనే హిందీ పాటకు డ్యాన్స్‌ చేశారు. ఆ పాటకు అనుగుణంగా. హావభావాలు పలికిస్తూ చేసిన డ్యాన్స్‌కు అక్కడ ఉన్న అందరూ ఫిదా అయ్యారు. నటీనటులందరూ ‘వావ్‌ సూపర్‌’ అంటూ చప్పట్లు కొట్టి మరి ఆమెను ఉత్సాహపరిచారు. ఈ డ్యాన్స్‌ పూర్తయ్యేటప్పటికి వెంకటేశ్‌ ఓ పూలమాలను తీసుకువెళ్లి రాధ మెడలో వేయగా, మెగాస్టార్‌ వెళ్ళి హాగ్ చేసుకుని మెచ్చుకున్నారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.

దీనికి సంబంధించిన వీడియోను ఆమె ట్విటర్‌ వేదికగా షేర్‌ చేస్తూ ‘‘80 రీయూనియన్‌కు సంబంధించిన ఓ మధుర జ్ఞాపకం. నాకెంతో ఇష్టమైన పాటకు డ్యాన్స్‌ చేసినందుకు సంతోషంగా ఉంది. దీనికంటే సంతోషకరమైన విషయం నా స్నేహితులు చిరు, వెంకటేశ్‌,పూనమ్‌, జాకీ ష్రాఫ్‌, సరిత అక్క,స్వప్నతో పాటు అందరూ నాపై చూపించిన ప్రేమ’’ అని రాసుకొచ్చారు.ఈ రీయూనియన్‌కు జాకీ ష్రాఫ్‌ ఆతిథ్యమివ్వగా చిరంజీవి, వెంకటేశ్‌, రమ్యకృష్ణ,నదియా,సుహాసిని,విద్యాబాలన్‌, శోభన, జయప్రద, రాధ, భానుచందర్‌,శరత్‌కుమార్‌,అనుపమ్‌ ఖేర్‌, నరేశ్‌, అర్జున్‌, అనిల్‌ కపూర్‌ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.

watch video :


End of Article

You may also like