Ads
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్న చిరకాల దాయాదుల పోరు ప్రారంభమైంది. ఆసియా కప్ 2023లో భాగంగా శ్రీలంక , క్యాండీలోని పల్లెకెలె స్టేడియం ఈ చారిత్రాత్మక మ్యాచ్ కి సాక్షిగా నిలిచింది. మొదట టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలత బ్యాటింగ్ ఎంచుకోవడం జరిగింది.
Video Advertisement
మ్యాచ్ కి వాన అడ్డంకి కలిగించే అవకాశం ఉంది అనే వార్తలు వచ్చినప్పటికీ…మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వాతావరణం ఎంతో అనుకూలంగా మారింది.
ఎంతో ఉత్కంఠత మధ్య ప్రారంభమైన ఈ హై వోల్టేజ్ మ్యాచ్ లో ప్రస్తుతం భారత్ బ్యాటింగ్ జరుగుతుంది. 45 ఓవర్లు పూర్తి అయ్యేసరికి భారత్ మొత్తం 8 వికెట్లు కోల్పోయింది. సరిగ్గా 45వ ఓవర్ తొలి బంతికే నసీమ్ షా , శార్దూల్ ఠాకూర్‌ను అవుట్ చేశాడు. మరోపక్క హార్దిక్ పాండ్యా,ఇషాన్ కిషన్‌తో తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడుతూ తన కెరీర్‌లో 11వ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
అయితే ప్రస్తుతం టీం తుది జట్టులో సీనియర్ పేసర్ మహమ్మద్ షమీకి చోటు దక్కకపోవడంపై అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. నిజానికి మహమ్మద్ షమీ స్థానంలో శార్దుల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకున్నారు. అయితే ఈ వ్యవహారంపై క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో పలు రకాల మీమ్స్ చేసి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మహమ్మద్ షమీ స్థానంలో వచ్చిన శార్దుల్ కేవలం మూడు పరుగులకే పెవీలియన్ దారి పట్టాడు.
టీం కెప్టెన్ రోహిత్ శర్మ తన తలా తోక లేని లాజిక్కులతో మంచి ప్లేయర్ అయిన మహమ్మద్ షమీని పక్కన పెట్టి శార్దుల్ ను టీంలోకి తీసుకున్నారని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. పైగా ఇప్పుడు కేవలం మూడు పరుగులకే శార్దూల్ అవుట్ కావడంతో ఈమాత్రం షమీ కొట్టలేడా.. ఇందుకేనా శార్దూల్ ను జట్టులోకి తీసుకుంది అని రకరకాల మీమ్స్ తో ప్రశ్నిస్తున్నారు.
#1
#2#3#4#5#6#7#8#9
ALSO READ : పాకిస్థాన్ తో జరగబోయే మ్యాచ్ లో… టీం ఇండియా చేస్తున్న మిస్టేక్ ఇదేనా..?
End of Article