Ads
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో నడుస్తున్న ఒకే ఒక్క టాపిక్ వకీల్ సాబ్. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఏప్రిల్ 9వ తేదీన బిగ్ స్క్రీన్ పై చూడబోతున్నాం అనే ఎగ్జైట్మెంట్ అన్ని చోట్లా ఉంది. టీజర్, ట్రైలర్, పోస్టర్స్, పాటలు ఇలా వకీల్ సాబ్ సినిమాకి సంబంధించిన ప్రతి విషయం ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో అంజలి, నివేతా థామస్, అలాగే మల్లేశం సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
Video Advertisement
ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా మొత్తం ఈ మూడు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. అలాగే శృతి హాసన్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. గబ్బర్ సింగ్, కాటమరాయుడు తర్వాత మళ్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శృతి హాసన్ మళ్లీ వకీల్ సాబ్ లో కలిసి నటించారు. ఈ సినిమాకి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. మొదటిసారిగా తమన్ పవన్ కళ్యాణ్ సినిమాకి మ్యూజిక్ అందించారు. వకీల్ సాబ్ సినిమాలోని పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా హిందీలో సూపర్ హిట్ అయిన సినిమాకి రీమేక్. పింక్ తమిళ్ లో కూడా నేర్కొండ పార్వై పేరుతో రీమేక్ అయ్యింది. ఇందులో తమిళ్ స్టార్ అజిత్ హీరోగా నటించారు.
ఇదిలా ఉండగా ఏప్రిల్ 4వ తేదీన వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. శిల్పకళావేదికలో జరిగిన ఈ ఈవెంట్ కి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. సినిమాలో హీరోయిన్స్ గా నటించిన అంజలి, అనన్యతో పాటు దర్శకులు హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, సాగర్ కే చంద్ర, క్రిష్ జాగర్లమూడి, ప్రొడ్యూసర్ ఎఎం రత్నం గారు, శివమణి, రామ్ తాళ్ళూరి ఇంకా ఎంతో మంది ఈ ఈవెంట్ కి గెస్ట్ లుగా వచ్చారు. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన మరొక వ్యక్తి యాక్టర్, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్. బండ్ల గణేష్ ఈ ఈవెంట్ లో ఇచ్చిన స్పీచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
End of Article