IPL 2022: GT Vs RR ఫైనల్ పోరులో… “గుజరాత్” టైటిల్ గెలవడంపై 15 మీమ్స్..!

IPL 2022: GT Vs RR ఫైనల్ పోరులో… “గుజరాత్” టైటిల్ గెలవడంపై 15 మీమ్స్..!

by Sunku Sravan

Ads

ఐపీఎల్ కు కొత్త ఛాంపియన్ వచ్చేసింది. ఐపీఎల్ 15 సీజన్ విజేతగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ ను చిత్తుచేసి టైటిల్ ని కైవసం చేసుకుంది. లీగ్ ఆరంభం నుంచి అదరగొడుతున్న గుజరాత్ ఎక్కడా తగ్గేదిలే అన్నట్లు ఆల్ రౌండ్ షోతో చెలరేగింది. లీగ్ లో అగ్రస్థానంలో నిలిచి క్వాలిఫైయర్ 1 ను దాటి నేరుగా ఫైనల్ కు చేరుకొని తుది పోరులో సైతం తన హవా చాటుకుంది.

Video Advertisement

ఆరంభం నుంచి ఉన్న జట్లే ఒక్క ట్రోఫీ కోసం తహతహలాడుతుంటే.. లీగ్ లోకి వచ్చి రావడంతోనే పాండ్యా సేన ట్రోఫీ ఎగరేసుకొని పోయింది. లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్లోనే రాజస్థాన్ తర్వాత టైటిల్ గెలుచుకున్న జట్టుగా గుజరాత్ టైటాన్స్ రికార్డు సృష్టించింది.అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ విజయం సాధించి చాంపియన్ గా అవతరించింది. ముందుగా రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 130/9 స్వల్ప స్కోరుకే పరిమితమైంది. గుజరాత్ బౌలర్లు రాజస్థాన్ ను తక్కువ పరుగులకే కట్టడి చేశారు.

 

బట్లర్ (39) మినహా ఏ ఒక్కరూ రాణించలేకపోయారు.ఇక లక్ష్యాన్ని గుజరాత్ సునాయాసంగా ఛేదించింది. గిల్ (45 నాటౌట్), హార్దిక్ పాండ్యా (34),డేవిడ్ మిల్లర్ (32 నాటౌట్ )రాణించడంతో గుజరాత్ విజయం సాధించింది.

#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11

#12

#13

#14

#15

#16

#17


End of Article

You may also like