Ads
అహ్మదాబాద్ వేదికగా శనివారం రాత్రి ఇంగ్లాండ్ కి భారత జట్టుకి మధ్య జరిగిన ఐదో టీ20 సిరీస్ ని టీమిండియా 3-2తో కైవసం చేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు ఓపెనర్లు విరాట్ కోహ్లీ (80 నాటౌట్: 52 బంతుల్లో 7×4, 2×6), రోహిత్ శర్మ ( 64: 34 బంతుల్లో 4×4, 5×6) స్కోర్ చేశారు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (32: 17 బంతుల్లో 3×4, 2×6) చేయగా, 2 బ్యాక్ టు బ్యాక్ సిక్సర్ల తర్వాత మరొక సిక్స్ కొట్టే ప్రయత్నంలో క్రిస్ జోర్దాన్ క్యాచ్ పట్టడంతో అవుటయ్యారు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా (39 నాటౌట్: 17 బంతుల్లో 4×4, 2×6) స్కోర్ చేశారు. టీమిండియా 2 వికెట్ల నష్టానికి 224 పరుగుల స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ జట్టు బౌలర్లలో ఆదిల్ రషీద్ ఒక వికెట్, బెన్ స్టోక్స్ ఒక వికెట్ పడగొట్టారు.
Video Advertisement
225 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లాండ్ టీమ్ ఓపెనర్ జేసన్ రాయ్ (0) ని భువనేశ్వర్ కుమార్ డకౌట్ చేశారు. డేవిడ్ మలాన్ (68: 46 బంతుల్లో 9×4, 2×6), జోస్ బట్లర్ (52: 34 బంతుల్లో 2×4, 4×6) హాఫ్ సెంచరీ నమోదు చేశారు. ఆ తర్వాత వచ్చిన జానీ బెయిర్‌స్టో (7), ఇయాన్ మోర్గాన్ (1), బెన్‌స్టోక్స్ (14) చేయగా చివరిలో క్రిస్ జోర్దాన్ (11), శామ్ కరన్ (14 నాటౌట్: 3 బంతుల్లో 2×4) చేశారు. ఇంగ్లండ్ జట్టు 188/8 స్కోర్ చేసింది. టీమిండియా బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్ మూడు వికెట్లు, భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు, హార్దిక్ పాండ్య ఒక వికెట్, నటరాజన్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18#19#20#21 #22
#23#24#25#26#27#28#29#30#31
#32
End of Article