పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బెస్ట్ సినిమాల్లో ఒకటి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది. ఈ సినిమా పేరు భవదీయుడు భగత్ సింగ్. ఈ టైటిల్ ని ఇవాళ అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ 28వ సినిమాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ హార్లే డేవిడ్సన్ బైక్ మీద కూర్చొని ఒక చేతిలో టీ గ్లాస్, ఒక చేతిలో మైక్ పట్టుకొని ఉన్నారు. అలాగే వెనకాల ఇండియా గేట్ కూడా కనిపిస్తోంది.

ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి ఈ సినిమాకి మళ్లీ గబ్బర్ సింగ్ సినిమాకు సంగీత దర్శకత్వం వహించిన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈసారి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు అని సినిమా బృందం ఇప్పటికీ చాలా సార్లు చెప్పారు. ఇంక ఈ పోస్ట్ చేసిన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8
#9#10#11#12#13#14

#15#16#17