Ads
చెన్నై లోని చెపాక్ స్టేడియం వేదికగా బుధవారం పంజాబ్ కింగ్స్ జట్టుకి, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి మధ్య జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. మ్యాచ్ లో అంతకుముందు టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. మయాంక్ అగర్వాల్ తో కలిసి ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన రాహుల్ (4: 6 బంతుల్లో) నాలుగవ ఓవర్ లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో కేదార్ జాదవ్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు.
Video Advertisement
తర్వాత వచ్చిన క్రిస్ గేల్ (15: 17 బంతుల్లో 2×4) చేయగా, ఆ తర్వాత నాలుగవ నెంబర్ లో వచ్చిన నికోలస్ పూరన్ (0) స్కోర్ చేశారు. హెన్రిక్యూస్ (14: 17 బంతుల్లో)తో కలిసి కాసేపు ఓపికగా ఆడిన దీపక్ హుడా (13: 11 బంతుల్లో 2×4) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. కానీ జట్టు స్కోర్ 63 దగ్గర ఉన్నప్పుడు అవుట్ అయ్యారు. తర్వాత వచ్చిన ఫాబియన్ అలెన్ (6: 11 బంతుల్లో), మురగన్ అశ్విన్ (9: 10 బంతుల్లో 1×4) చేయగా, చివరిలో మహ్మద్ షమీ (3: 3 బంతుల్లో), అర్షదీప్ సింగ్ (1 నాటౌట్: 2 బంతుల్లో) స్కోర్ చేశారు. పంజాబ్ కింగ్స్ జట్టు 120 పరుగుల స్కోర్ చేసింది.
121 పరుగుల లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో (63 నాటౌట్: 56 బంతుల్లో 3×4, 3×6), కెప్టెన్ డేవిడ్ వార్నర్ (37: 37 బంతుల్లో 3×4, 1×6) చాలా మంచి ఆరంభాన్ని ఇచ్చారు. స్పిన్నర్ ఫాబియన్ అలెన్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయిన డేవిడ్ వార్నర్, ఫీల్డర్ మయాంక్ అగర్వాల్ చేతికి చిక్కారు. మూడవ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చిన కేన్ విలియమ్సన్ (16 నాటౌట్: 19 బంతుల్లో)తో కలిసి జానీ బెయిర్‌స్టో మ్యాచ్ ఆఖరి వరకూ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు.సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 18.4 ఓవర్లలో 121/1 స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
End of Article