“అత్తింట్లో అన్ని ఉన్నాయ్ అనుకున్నా” అంటూ…కొత్తగా పెళ్లైన కూతురు తన తల్లికి పంపిన ఈ మెసేజ్ చూస్తే కన్నీళ్లొస్తాయి.!

“అత్తింట్లో అన్ని ఉన్నాయ్ అనుకున్నా” అంటూ…కొత్తగా పెళ్లైన కూతురు తన తల్లికి పంపిన ఈ మెసేజ్ చూస్తే కన్నీళ్లొస్తాయి.!

by Mohana Priya

అమ్మా..! ఎలా ఉన్నావ్.. నువ్వు పక్కన ఉన్నంత వరకు నేను బాగానే ఉన్నాను అమ్మా.. నిన్ను వదిలి ఇక్కడకి వచ్చిన తరువాతే నువ్వు నాకోసం ఎన్ని త్యాగాలు చేసేదానివో తెలిసొచ్చింది అమ్మా.. నీ దగ్గర ఉన్నంత వరకు తెలియరాలేదు.

Video Advertisement

నా అందమైన కలల ప్రపంచం లో బతికేసాను.. నాకోసం రెక్కల గుర్రం పై వచ్చే రాకుమారుడి కోసం ఎదురుచూస్తూ ఉన్నాను.. నా జీవితమంతా అతనితో గడపాలని, నవ్విస్తే నవ్వాలని తాపత్రయపడ్డాను..

కానీ వాస్తవాలు కఠినం గా ఉంటాయని తెలుసుకోలేకపోయాను. పెళ్లి చేసుకుని వచ్చిన తరువాత, ఓ కుటుంబాన్ని నిర్వహించడం వెనక ఇంత కష్టం ఉంటుందని తెలుసుకున్నాను. ఒక్కసారిగా మారిపోయిన పరిస్థితులు నన్ను గందరగోళానికి గురి చేస్తున్నా, నేను స్థిరంగా ఎలా ఉంటున్నానో తెలుసా అమ్మా? నిన్ను చూసే నేను ఇలా ఉండగలుగుతున్నాను. నీకు గుర్తుందా అమ్మా, నేను రోజు పొద్దున్నే ఎన్నింటికి నిద్ర లేస్తానో. అది కూడా నువ్వు నన్ను బుజ్జగించి లేపేదానివి. లేవగానే నా చేతిలో కాఫీ ప్రత్యక్షం అయ్యేది. నేను స్నానం చేసేసరికి ప్లేట్ లో టిఫిన్ పెట్టేదానివి.. ఆడుతూ పాడుతూ గడిపేసే నేను పెళ్లి అయ్యాక కొత్త పాఠాలు నేర్చుకుంటున్నా అమ్మా. నువ్వు ఎన్ని సార్లు నాకు చెప్పినా అర్ధం కాలేదు.. అత్తారిల్లు అయితే మాత్రం ఏంటి లే అనుకునేదాన్ని.

girl wedding

కానీ ఇక్కడ, అందరికంటే నేనే ముందు లేవాలి. అందరిని నేనే బుజ్జగించాలి. అందరికి కావాల్సినవి నేనే చూడాలి. అందరు నా పైనే ఆధారపడి ఉంటారు. ఎవరికి ఏమి తినాలని ఉన్నా అది నేనే వండిపెట్టాలి.. నాకోసం కూడా నేనే చూసుకోవాలి. అందరిని నేనే పట్టించుకుంటూ ఉంటె, చిన్నపుడు నన్ను కూడా ఇలానే లాలించిన నువ్వు గుర్తుకొస్తున్నావు అమ్మా.. అత్తారింట్లో అన్ని ఉంటాయి కదా అనుకున్నాను. కానీ అమ్మ ఉండదు అన్న సంగతి ఇప్పుడే తెలిసొస్తోంది అమ్మా.

నీకో విషయం తెలుసా.. నాకు చాలా సార్లు ఇక్కడ ఉండాలనిపించదు. నీ దగ్గరకి వచ్చేసి నీ వొళ్ళో తల పెట్టుకుని పడుకోవాలనిపిస్తుంది. నీ చేత నాకు నచ్చినవి వండించుకుని తినాలనిపిస్తుంది. కానీ, ఆలోచిస్తే, ఒకప్పుడు నువ్వు కూడా నాలాగే అత్తారింటికి వచ్చి ఉంటావ్ కదా. నువ్వు ఎన్ని త్యాగాలు చేస్తే, మమ్మల్ని పెంచగలిగావు. ఎన్ని బాధ్యతలు మోస్తే మేము ఇంతవాళ్ళం అవ్వగలిగాం. నేను నిన్నే స్ఫూర్తి గా తీసుకుంటాను. నీలా బాధ్యతలు పంచుకుంటాను.


You may also like

Leave a Comment