“మీటర్” సెన్సార్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?

“మీటర్” సెన్సార్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?

by kavitha

Ads

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘మీటర్’ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. కిరణ్ అబ్బవరం ఈ చిత్రంలో మొదటి సారిగా కంప్లీట్ కమర్షియల్ రోల్ లో నటిస్తున్నాడు. కిరణ్ అబ్బవరం ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి, ఇప్పుడిప్పుడే నిలదొక్కు కుంటున్నాడు.

Video Advertisement

టాలెంటెడ్ యాక్టర్ గా ఇప్పటికే పేరు సంపాదించాడు. ఇటీవల రిలీజ్ ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రం కిరణ్ కెరీర్‌లో మరో హిట్ మూవీగా నిలిచింది. ఈ మూవీ విజయంతో కమర్షియల్ హీరోగా కిరణ్ నిరూపించుకున్నాడు. అతని పై ఎన్ని విమర్శలు వస్తున్నా, అవేవీ పట్టించుకోకుండా తన కెరీర్ పై మాత్రమే దృష్టి పెట్టడం వల్లే కిరణ్ అబ్బవరంకు హిట్  కొట్టగలిగాడు. meter-movie-censor-completedఇక త్వరలో విడుదల అవనున్న ‘మీటర్’ చిత్రంలో కిరణ్ అబ్బవరం పవర్‌ఫుల్ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీలో కిరణ్ లుక్ కొత్తగా ఉండబోతుందని టాక్. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ మూవీకి U/A సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక ఈ చిత్రం సందేశాత్మకంగా టెంపర్ సినిమా రేంజ్ లో ఉంటుందని వినిపిస్తోంది. ఈ మూవీ నిడివి2 గంటల 7 నిమిషాలు. ఈ మూవీలో హీరోయిన్ గా అతుల్య రవి నటిస్తోంది. సాయి కార్తీక్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
meter-movie-censor-completed-1వినరో భాగ్యము విష్ణుకథ విజయంతో రిలీజ్ కాబోతున్న ‘మీటర్’ మూవీ పై అంచనాలు పెరిగిపోయాయి. మైత్రీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. పది కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా మంచి బిజెనెస్ చేసుకుంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తే, కిరణ్ 20 కోట్ల హీరోగా అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకొంచెం ట్రై చేసినట్లయితే కిరణ్ టైర్ టూ హీరోల లిస్ట్ లో చేరే అవకాశం ఉందని చెప్పొచ్చు. meter-movie-censor-completed-2Also Read: “కన్నడలో కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ నీల్ … టాలీవుడ్‌కి ఎందుకు వెళ్ళిపోయాడు.?” అనే ప్రశ్నకు… దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన నెటిజన్..!

 


End of Article

You may also like