Ads
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరి హర వీరమల్లు సినిమా టీజర్ వచ్చింది. దాదాపు నాలుగు సంవత్సరాల నుండి ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మధ్యలో కొంత కాలం బ్రేక్ పడింది. మళ్లీ ఈ సినిమా షూటింగ్ ఇటీవల మొదలుపెట్టారు. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా రెండు భాగాల్లో విడుదల అవుతుంది అని టీజర్ చూస్తే తెలుస్తోంది. మొదటి భాగానికి స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ అని పేరు పెట్టారు. యానిమల్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు.
Video Advertisement
గతంలో ఈ పాత్రకి అర్జున్ రాంపాల్ ని అనుకున్నారు. షూటింగ్ కూడా అయ్యాక సినిమా మధ్యలో నుండి వెళ్లిపోయారు. ఇప్పుడు క్రిష్ జాగర్లమూడి కూడా ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు తీసుకోవట్లేదు. జ్యోతి కృష్ణ ఈ సినిమా డైరెక్ట్ చేస్తారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వ పర్యవేక్షణలో జ్యోతి కృష్ణ ఈ సినిమాకి డైరెక్షన్ చేస్తారు. జ్యోతి కృష్ణ ఇటీవల రూల్స్ రంజన్ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇది ఒక పిరియాడిక్ డ్రామా. క్రిష్ జాగర్లమూడి ఇలాంటి సినిమాలు చాలా బాగా తీస్తారు అని పేరు ఉంది. అలాంటిది ఇప్పుడు క్రిష్ దర్శకత్వ బాధ్యతలు తీసుకోకపోవడం అనేది ఆందోళనకి గురి చేసే విషయంగా మారింది. టీజర్ చూస్తూ ఉంటే కూడా ఎక్కడా ఒక్క హై మూమెంట్ కూడా లేదు. ఏదో అలా వెళ్ళిపోయింది.
ఒకరకంగా చెప్పాలి అంటే టీజర్ లో ఇవే మైనస్ పాయింట్స్ అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ చేత ఒక్క డైలాగ్ చెప్పించినా కూడా బాగుండేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే, ఇప్పుడు ప్రతి సినిమా రెండు భాగాలుగా విడుదల అవ్వడం అనేది ఒక ట్రెండ్ గా మారింది. బాహుబలి సినిమా నుండి చాలా సినిమాలు ఇలాగే వస్తున్నాయి. ఇప్పుడు పుష్ప సినిమా రెండవ భాగం వస్తోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకి కూడా రెండవ భాగం వస్తుంది అని చెప్పారు. టిల్లు స్క్వేర్ ఇటీవల విడుదల అయ్యి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా కూడా రెండు భాగాలుగా రూపొందుతోంది.
అయితే ప్రతి సినిమాని ఇలా రెండు మూడు భాగాల్లో చిత్రీకరించడం అనేది కాస్త రిస్క్ తో కూడుకున్న విషయమే. ఎందుకంటే, సినిమా స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా లేకపోతే సినిమా తెర మీద ఆసక్తికరంగా కనిపించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు రెండు భాగాలుగా విడుదలవుతున్న చాలా సినిమాల్లో ఇలాగే జరుగుతోంది. ఒక సీన్ కి ఎక్కువ సమయం కేటాయించే బదులు స్క్రీన్ ప్లే తో ఫాస్ట్ గా నడిపించి సినిమాని ఒకటే భాగంలో ముగించే అవకాశాలు ఉంటాయి. మరి ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల చేయడానికి కారణాలు ఏంటో తెలుసుకోవాలి అంటే సినిమా విడుదల అయ్యేంతవరకు ఆగాల్సిందే. కానీ టీజర్ లో చూపించిన ఈ విషయాల మీద మాత్రం కామెంట్స్ వస్తున్నాయి.
watch video :
ALSO READ : నందమూరి హీరో “కళ్యాణ్ చక్రవర్తి” గుర్తున్నారా..?? ఇప్పుడెలా ఉన్నారో తెలుసా..??
End of Article