ఈ సంవత్సరం దసరా సినిమాతో హిట్ కొట్టిన నాని, ఇప్పుడు హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలో నాని పక్కన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సినిమా టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సినిమాలో నాని ఒక అమ్మాయికి తండ్రిగా నటిస్తున్నారు.

Video Advertisement

నాని కూతురి పాత్రలో కియారా ఖన్నా నటించింది. ఈ సినిమాతో శౌర్యువ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. సినిమా టీజర్ నిన్న విడుదల అయ్యింది.

minus point in hi nanna teaser

టీజర్ లో హీరో హీరోయిన్లతో పాటు, సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న నటులు జయరాం, అలాగే హీరో కూతురి పాత్ర పోషించిన కియారా కూడా కనిపిస్తున్నారు. అయితే టీజర్ చూశాక రెస్పాన్స్ మాత్రం చాలా మిక్స్డ్ గా ఉంది. సినిమా టీజర్ లో ఈ విషయాలు కాస్త డిసప్పాయింట్ చేశాయి అని అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. “సినిమా టీజర్ అంతా బాగానే ఉన్నా కూడా చాలా స్లోగా వెళుతుంది” అని అన్నారు.

minus point in hi nanna teaser

“టీజర్ వరకు ఇలా ఉంటే పర్వాలేదు. కానీ సినిమా విషయంలో ఇలా జరగకపోతే చాలు” అని అంటున్నారు. ఎందుకంటే అంటే సుందరానికి సినిమా కాన్సెప్ట్ పరంగా బాగానే ఉన్నా కూడా నిడివి విషయంలో అప్పుడు చాలా కామెంట్స్ వచ్చాయి. సినిమా చాలా డ్రాగ్ చేశారు అని అన్నారు. ఇప్పుడు ఈ సినిమా విషయంలో మంచి కాన్సెప్ట్ ఉన్నప్పుడు, అంతే మంచి రన్ టైం ఉంటే సినిమా హిట్ అవ్వడం గ్యారెంటీ అని ఇప్పటికే ఒక అంచనా వేస్తున్నారు.

minus point in hi nanna teaser

అంతే కాకుండా టీజర్ లో ఏదో మిస్ అయ్యింది అంటున్నారు. అంతా పర్ఫెక్ట్ గా అనిపిస్తున్నా కూడా ఏదో వెలితిగా ఉంది అని అన్నారు. టీజర్ చూస్తూ ఉంటే కాలేజ్ సమయంలో ఫ్రెండ్స్ అయిన ఇద్దరు, తర్వాత జీవితంలో ఇంకొక స్టేజ్ లో ఉన్నప్పుడు కలిసినప్పుడు ఎలా ఉంటుంది అని ఈ సినిమాలో చూపించారు ఏమో అని అంటున్నారు. సినిమా నుండి రిలీజ్ అయిన రెండు పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి. సినిమా ట్రైలర్ వచ్చాక ప్రేక్షకుల అభిప్రాయం ఏమైనా మారుతుందేమో వేచి చూడాల్సిందే.

watch video :

ALSO READ : “యష్” నుండి… “మృణాల్ ఠాకూర్” వరకు… “సీరియల్స్” నుండి సినిమాల్లోకి వచ్చిన 10 యాక్టర్స్..!