Ads
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆడియన్స్ ముందుకు ఈ ఇయర్ లో రెండో సారి వచ్చేశాడు, సమ్మర్ లో వచ్చిన ఆచార్య భారీ డిసాస్టర్ అయిన తర్వాత మలయాళ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ గా గాడ్ ఫాదర్ చేసిన మెగాస్టార్…. దసరా కానుకగా సినిమాను బాక్స్ ఆఫీస్ బరిలోకి దించగా సినిమా పై ఆడియన్స్ లో పర్వాలేదు అనిపించేలా హైప్ ఏర్పడింది.
Video Advertisement
అయితే గాడ్ ఫాదర్ సినిమాకు తొలి ఆట తోనేసూపర్ హిట్ టాక్ రావడంతో మెగాభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మాతృకతో పోలిస్తే కథనం లో చాలా మార్పులు చేసారు దర్శకుడు మోహన్ రాజా. దీంతో మంచి హిట్ గా నిలిచింది గాడ్ ఫాదర్.
సినిమా హిట్ అయినా.. ఈ చిత్రం లో కొన్ని మైనస్ పాయింట్ లు ఉన్నాయి. అవి కూడా సరి చూసుకొని ఉంటే మూవీ రిసల్ట్ వేరేలా ఉండేది అని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అవేంటో చూద్దాం..
#1 మామూలు గా మలయాళం లూసిఫర్ కంటెంట్ డ్రివెన్ సినిమా. ఆ సినిమా చాలా సీరియస్ గా ఉంటుంది . కానీ తెలుగు నేటివిటీ కోసం కొన్ని మార్పులు చేసారు . కానీ ఆ క్రమంలో కథ లో ఉన్న సీరియస్ నెస్ మిస్ అయ్యింది.
#2 మలయాళంలో నయనతార పాత్రలో నటి మంజు వారియర్ నటించారు . ఆ చిత్రం లో ఆమె పాత్ర సీరియస్ గా ఉంటుంది. కానీ నయనతార మాత్రం సినిమాలో డల్ గా ఉంటారు. ఒరిజినల్ లో ఆ పాత్రకి ఉన్న డెప్త్ తెలుగులో కనిపించలేదు.
#3 పేరుకి పొలిటికల్ డ్రామా అని పెట్టారు . కానీ సినిమా అంతా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ లానే ఉంటుంది. అంత కొత్తగా ఏం అనిపించలేదు. ఈ నటులు కాకుండా అంత పెద్ద స్టార్ డామ్ లేని నటులు ఉంటే సినిమాకి ఈ రెస్పాన్స్ వచ్చేది కాదేమో.
#4 అసలు సల్మాన్ ఖాన్ ని ఆ పాత్రకి ఎందుకు ఎంచుకున్నారో తెలీదు. ఆ పాట ఎందుకు వచ్చిందో కూడా అర్ధం కాదు. ఆ రోల్ ప్రత్యేకంగా ఏం లేదు. సల్మాన్ ఖాన్ కి తెలుగులో బాగా పాపులారిటీ కూడా లేదు. దాని బదులు పవన్ కళ్యాణ్ ని కానీ లేదా ఇంకా ఎవరైనా మన దగ్గర ఫేమ్ ఉన్న నటుడు ఉంటే ఆ రోల్ కనీసం ప్రేక్షకులకి గుర్తుండిపోయేది.
సల్మాన్ ఖాన్ కాకుండా మరో టాలీవుడ్ నటుడు ఈ సినిమాలో నటించి ఉంటే ఈ సినిమా రేంజ్ కచ్చితంగా పెరిగి ఉండేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సల్మాన్ ఖాన్ స్క్రీన్ పై కనిపించిన సన్నివేశాలు సిల్లీగా ఉండటంతో పాటు ఆ సీన్లలో గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయి.
#5 మలయాళం తో పోల్చి చూస్తే తెలుగు లో చాలా మార్పులు చేసారు . ఆ క్రమంలో కొన్నియాక్షన్ సీన్స్ యాడ్ చేసారు.అందులో సల్మాన్ ఖాన్ ఒక ట్రక్ పేల్చే సీన్ ఉంది . అంత సీరియస్ యాక్షన్ సీన్ ని చాలా కామెడీ గా చేసారు. అసలు బైక్ లో నుండి నిప్పు లాంటిది ఎదో వచ్చి ట్రక్ పేలింది అనే విధంగా చూపించారు. మలయాళంలో టొవినో థామస్ రోల్ తెలుగులో అసలు లేదు.
దాంతో ఈ చిత్రం బావున్నా కానీ ఈ మార్పులు కూడా చూసుకొని ఉంటే బాగుంది అని ప్రేక్షకులు అంటున్నారు. అంతే కాకుండా రీమేక్ మూవీ కావడంతో సినిమా ఎంత హిట్ అయినా కలెక్షన్లు రావు అవి విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో చిరు ఇకపై రీమేక్ లకి దూరంగా ఉంటే మంచిదని ఫాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
End of Article