మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా ఇటీవల విడుదల అయ్యింది. ఈ సినిమాకి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రవితేజ రెండు పాత్రల్లో నటించారు. సినిమా విడుదల అయ్యే ముందు చాలా అంచనాలు ఉన్నాయి. రవితేజ అంతకుముందు నటించిన సినిమాలు ఆశించిన ఫలితాన్ని పొందలేదు. ఇప్పుడు ఈ సినిమా విడుదల అయ్యే ముందు సినిమా ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

Video Advertisement

సినిమా ట్రైలర్ చూశాక ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్థం అయ్యింది. ఈ ట్రైలర్ ఉన్నట్టే సినిమా ఉంటే చాలు అని అనుకున్నారు. సినిమాకి ప్రస్తుతం టాక్ మిక్స్డ్ గా వస్తోంది. అయితే ఈ సినిమాలో కొన్ని విషయాలపై మాత్రం ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాకి మైనస్ అయిన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

dhamaka movie review

#1 ముందుగా ఈ సినిమా కథ గురించి చాలా కామెంట్స్ వస్తున్నాయి. సినిమా కథలో అస్సలు కొత్తదనం లేదు అని అంటున్నారు. ఇలాంటి కథ ఉన్న సినిమాలు మనం చాలా చూశాం. నెక్స్ట్ ఏమవుతుంది అనే ఆసక్తి చూసే ప్రేక్షకులకు ఉండదు.

ravi teja dhamaka movie censor talk..

#2 అలాగే హీరో, హీరోయిన్ కి మధ్య వచ్చే సీన్స్. ఇద్దరు వేరువేరుగా బాగా నటించారు. కానీ వారి ఇద్దరికీ మధ్య వచ్చే సీన్స్ మాత్రం చూడడానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి అని అంటున్నారు. వారిద్దరి మధ్య ఉన్న వయసు తేడా ఎంత కవర్ చేయాలని ప్రయత్నించినా కూడా తెలిసిపోయింది అని కామెంట్స్ చేస్తున్నారు.

dhamaka movie review

#3 సినిమా రవితేజ అభిమానులకి పండగలా ఉండేలాగా ఉండాలి అని అనుకున్నారు. అందుకే మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండేలా చూసుకున్నారు. కానీ ఇవి ఒక పాయింట్ తర్వాత ఎక్కువ అయ్యాయి ఏమో అనిపిస్తాయి. కథ అంతా వదిలేసి కేవలం వీటి మీద ఎక్కువగా దృష్టి పెట్టారు ఏమో అని అంటున్నారు.

#4 అసలు ఇద్దరు హీరోలకి మధ్య తేడా చూపించాలి అంటే ఒక హీరోకి కళ్ళజోడు ఉంటుంది. ఒక హీరోకి కళ్ళజోడు ఉండదు అని చూపించారు. అలాగే ఇద్దరి పాత్రలు కూడా ఒకరు క్లాస్ గా ఉంటారు. ఒకరు మాస్ గా ఉంటారు అన్నట్టు తెరపై చూపించడానికి ప్రయత్నించారు. కానీ ఇలాంటి పాత్రలు చేసిన హీరోలు, అలాగే ఇలాంటి పాత్రలతో వచ్చిన సినిమాలు అంతకుముందు చాలా ఉన్నాయి. దాంతో ఆ ఇద్దరు పాత్రలకి మధ్య ఉన్న తేడాలు ఇంకా కొంచెం జాగ్రత్తగా చూపించాల్సింది అని అన్నారు.

ravi teja dhamaka movie censor talk..

#5 రవితేజ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కొంచెం ఎక్కువగానే ఉంది. కానీ సినిమాలో రవితేజ తప్ప ఇంకా ఏది పెద్దగా చెప్పుకోవడానికి లేదు. అసలు ఇంక మిగిలిన వాళ్ళు, మిగిలిన ముఖ్య పాత్రల్లో నటించిన వారు ఎందుకు వస్తున్నారు, ఎందుకు పోతున్నారు అనేది కూడా ప్రేక్షకులకు అర్థం కాలేదు అని అంటున్నారు. వారిపై కూడా కొంచెం శ్రద్ధ వహించాల్సింది అని అన్నారు.

minus points in dhamaka movie

ఏది ఏమైనా సరే ప్రస్తుతం అయితే ధమాకా సినిమా థియేటర్లలో నడుస్తోంది.