పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు గత వారం రోజులుగా ఓజి టీజర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.  ఐదు సంవత్సరాల తర్వాత తమ అభిమాన స్టార్ నటిస్తున్న స్ట్రెయిట్ సినిమా కావడంతో ఈ మూవీ పై ఫ్యాన్స్ అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

Video Advertisement

గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ఓజి సినిమాను నిర్మిస్తున్న డివివి ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రం గురించి తరచూ అప్డేట్స్ ఇస్తూ, మూవీ పై హైప్ ను ఎప్పటికప్పుడు పెంచుతూ వస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజుని సందర్భంగా తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ లో ఇదే మైనస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తూన్న మూవీ ఓజి. ఈ మూవీని దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్నాడు.  ప్రియాంకా అరుళ్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు.
ఈ చిత్రంలో పవన్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ బర్త్ డే పురస్కరించుకుని ఈ మూవీ నుండి ఈరోజు 100 సెకండ్ల నిడివి ఉన్న టీజర్ ను రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే రేంజ్​లో ‘హంగ్రీ చీతా’ అంటూ రిలీజ్​ చేసిన టీజర్ సోషల్​మీడియాను షేక్ చేస్తోంది. ముందుగా మేకర్స్ చెప్పినట్టుగానే ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ లుక్స్​, బ్యాక్​ గ్రౌండ్​ మ్యూజిక్, వైలైన్స్​ ఊహించని రేంజ్​లో చాలా పవర్​ఫుల్​గా ఉన్నాయి.
అర్జున్ దాస్ ఇచ్చిన వాయిస్ ఓవర్ తో ఉన్న ఈ వీడియో అంతా ఎలివేషన్లతో నిండిపోయింది. అయితే ఈ టీజర్ ఫ్లోనెస్ మధ్యలోనే ఆపేసినట్టు ఉందని, చివరి 5 సెకన్లు పర్వాలేదనిపించింది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. లైటింగ్ విజువల్స్ ఇంకా క్వాలిటీగా ఉంటే బాగుండేదని  అంటున్నారు.

Also Read: “థాంక్యూ సుజిత్ అన్నా..!” అంటూ… “పవన్ కళ్యాణ్” OG గ్లింప్స్ పై 15 మీమ్స్..!