నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సినిమా దసరా. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. నాని, కీర్తి సురేష్ కలిసి అంతకుముందు నేను లోకల్ సినిమాలో నటించారు.

Video Advertisement

మళ్లీ ఇప్పుడు ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదల అయిన తర్వాత నాని గెటప్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా చాలా మాస్ గా ఉంటుంది అని అర్థం అవుతోంది. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ అందిస్తున్నారు.

minus points in nani dasara trailer

ఈ సినిమా పాటలు కూడా ఇప్పటికే చాలా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నారు. వారిలో కొంత మంది తెలుగు వాళ్ళు అయితే, మరి కొంత మంది మిగిలిన భాషల వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సినిమా పాన్-ఇండియన్ సినిమాగా విడుదల అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ పనిలో సినిమా బృందం అంతా బిజీగా ఉంది. అయితే ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. దీనికి చాలా మంచి స్పందన వస్తోంది. దాంతో పాటు కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

minus points in nani dasara trailer

#1 సినిమా ట్రైలర్ చూసిన తర్వాత రెండు రకాల కామెంట్స్ వినిపించాయి. అందులో కొంత మంది, “నాని చాలా కొత్తగా ఉన్నారు” అంటే, మరి కొంత మంది మాత్రం, “నాని ఇలా చేయడం చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది” అంటున్నారు. నాని ని చూస్తూ ఉంటే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గుర్తొస్తున్నారు అని అంటున్నారు. నాని బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉన్నా కూడా, ఫైటింగ్ చేసే విధానం, అలాగే హెయిర్ స్టైల్ ఇదంతా కూడా పుష్ప సినిమా గుర్తొస్తోంది అని అంటున్నారు.

minus points in nani dasara trailer

#2 సినిమాలో చాలా మంది ప్రముఖ నటీనటులు ఉన్నారు. కానీ వారందరూ తెలుగువారు కాకుండా వేరే ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఉన్నారు. అందులోనూ ముఖ్యంగా కన్నడ హీరో దీక్షిత్ శెట్టి, అలాగే మలయాళ హీరో షైన్ టామ్ చాకో కూడా ఉన్నారు. వారు తెలుగు వారికి పెద్దగా తెలిసే అవకాశం లేదు. దాంతో ట్రైలర్ చూసిన వాళ్ళందరికీ కూడా నాని, కీర్తి సురేష్ తప్ప మిగిలిన వాళ్ళు కొత్తగా అనిపించారు.

minus points in nani dasara trailer

#3 సాధారణంగా ఒక సినిమా వచ్చింది అంటే అంతకుముందు దగ్గర దగ్గర అలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలతో పోల్చడం చాలా సహజమైంది. ఇప్పుడు దసరా ట్రైలర్ చూసి కూడా కొంత మంది పుష్ప సినిమాతో పోలుస్తున్నారు. మరి కొంత మంది ఏమో బొగ్గు గనులు అవన్నీ చూసి కేజీఎఫ్ సినిమాతో పోలుస్తున్నారు. సినిమా స్టోరీ అలాగే లేకపోయినా సడన్ గా చూస్తే ఆ సినిమాలు గుర్తొచ్చాయి అని అంటున్నారు.

minus points in nani dasara trailer

#4 ఒక సినిమా ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వాలి అంటే అందులో ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే అంశాలు ఉండాలి. దసరా ట్రైలర్ చూసిన వాళ్లు అందరూ కూడా, “ఈ సినిమాలో యాక్షన్ మోతాదు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాకి పెద్దగా కనెక్ట్ అవ్వరు ఏమో” అని అంటున్నారు. మరి కొంత మంది ఏమో, “ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉండే అవకాశం ఉంది” అని అంటున్నారు.

minus points in nani dasara trailer

#5 ఇది పక్కా తెలంగాణ సినిమా. మన తెలుగు సినిమా. అది కూడా గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరించిన సినిమా. ఈ సినిమాని పాన్-ఇండియన్ సినిమాగా విడుదల చేస్తున్నారు. సౌత్ ఇండియాలో సాంప్రదాయం ఒకేలాగా ఉంటుంది కాబట్టి ఇక్కడి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. కానీ నార్త్ ఇండియా మన సంప్రదాయాలతో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దాంతో హిందీ ప్రజలకి సినిమా నచ్చుతుందా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

minus points in nani dasara trailer

ఏదేమైనా సరే ట్రైలర్ చూశాక చాలా మంది మాత్రం సినిమాపై ఆసక్తి ఇంకా పెరిగింది అంటున్నారు. ప్రతి సినిమా ఒక సినిమాతో మరొక సినిమా పోలిక లేకుండా చూసుకునే హీరోల్లో నాని ఒకరు. అంటే సుందరానికి సినిమాలో ఒక సాధారణ యువకుడిగా కనిపించిన నాని, ఇప్పుడు ఈ సినిమాలో పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపిస్తున్నారు. దాంతో ట్రైలర్ చూసిన చాలా మంది, “ఇది మన తెలుగు సినిమాని మరొక స్థాయికి తీసుకెళ్లే సినిమా అయ్యా అవకాశం ఉంది” అని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యేంత వరకు ఆగాల్సిందే.

watch video :