ప్రభాస్ “ఆదిపురుష్” టీజర్‌లో… మైనస్ అయిన 5 విషయాలు ఇవేనా..?

ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా టీజర్ నిన్న విడుదల అయ్యింది. అయోధ్యలో ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. తెలుగుతో పాటు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ టీజర్ విడుదల అయ్యింది. బాహుబలి తర్వాత నుండి ప్రభాస్ నటించిన అన్ని సినిమాలు కూడా తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో విడుదల అవుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాగే విడుదల అవుతోంది.

ఈ సినిమాకి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఓం రౌత్ అంతకుముందు తానాజీ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆ సినిమా హిందీలో చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇందులో సీత పాత్రలో కృతి సనన్ నటిస్తున్నారు. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నారు. టీజర్ లో ప్రభాస్ తో పాటు వీరు కూడా కనిపిస్తున్నారు. రాముడిగా ప్రభాస్ లుక్ చాలా బాగుంది అంటూ ప్రేక్షకులు అభినందిస్తున్నారు. కానీ దీంతోపాటు కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇందులో కొన్ని విషయాలు ప్రేక్షకులని నిరాశపరిచాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

minus points in prabhas adipurush teaser

#1 అసలు సినిమా యానిమేషన్ సినిమా అని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రభాస్ రాముడి లుక్ లో కనిపిస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ టీజర్ స్టార్టింగ్ చూడంగానే యానిమేషన్ లో ఉన్న ప్రభాస్ రాముడి లుక్ లో కనిపించారు. దాంతో ప్రేక్షకులు కొంత నిరాశ చెందారు.

minus points in prabhas adipurush teaser

#2 ఈ సినిమా కోసం ప్రేక్షకులు దాదాపు సంవత్సరం నుండి ఎదురు చూస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ అలాంటి ఒక సినిమా చేయబోతున్నారు అని అందరూ అనుకున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. దాంతో ఈ సినిమా మళ్లీ బాహుబలి రేంజ్ హిట్ అవుతుంది అనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండడంతో టీజర్ కి ఇలాంటి రెస్పాన్స్ వస్తోంది.

minus points in prabhas adipurush teaser

#3 సాధారణంగా ఇలాంటి పురాణాలని యానిమేషన్ రూపంలో అంతకు ముందు చాలా సార్లు టీవీలో చూపించారు. సినిమాలు కూడా వచ్చాయి. దాంతో ప్రేక్షకులకు ఇది అంత పెద్ద కొత్తగా ఏమీ అనిపించలేదు. అయితే కథ పరంగా ఏమైనా కొత్తగా ఉంటుందేమో అని కొంత మంది అంటున్నారు.

minus points in prabhas adipurush teaser

 

#4 ప్రభాస్ ఒక తెలుగు హీరో. కానీ ప్రభాస్ హీరోగా నటించిన గత సినిమాలు బాలీవుడ్ ప్రేక్షకులకి కూడా నచ్చేలాగా తీస్తున్నారు. దాంతో నేటివిటీ తేడా వస్తోంది. అందుకే ఆ సినిమాల ఫలితం కూడా ఒక ప్రాంతంలో ఒకలాగా మరొక ప్రాంతంలో మరొక లాగా వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా కూడా బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్టు తీస్తున్నారు ఏమో అనిపిస్తుంది. దర్శకుడు బాలీవుడ్ దర్శకుడు కాబట్టి సినిమా ముందు అక్కడివారికి నచ్చాలి అని, తర్వాత మన నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయేమో అని టీజర్ చూస్తే అనిపించింది.

minus points in prabhas adipurush teaser

#5 సినిమాకి ముఖ్యమైనది నటీనటులు. ఈ సినిమాలో తెలుగు వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. తెలుగు వాళ్ళు పక్కన పెడితే అసలు సౌత్ ఇండియన్ నటులు తక్కువగా ఉన్నారు. సినిమాలో నటించిన వాళ్ళని చూస్తే కృతి సనన్ తెలుగులో రెండు సినిమాలు చేసినా కూడా బాలీవుడ్ లోనే ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. లక్ష్మణుడి పాత్ర పోషించిన సన్నీ సింగ్ కూడా హిందీలో కొన్ని సినిమాల్లో నటించారు. అలాగే రావణుడి పాత్ర పోషించిన సైఫ్ అలీ ఖాన్ కూడా బాలీవుడ్ స్టార్ హీరో.

minus points in prabhas adipurush teaser

అలాగే మిగిలిన వాళ్ళు కూడా హిందీ వారికి సుపరిచితులైన నటులు. వారు తెలుగులో తెలిసే అవకాశాలు చాలా తక్కువ. లక్ష్మణుడి పాత్ర సినిమాకు చాలా ముఖ్యమైన పాత్ర. అలాంటి పాత్ర కోసం అయినా కనీసం ఒక తెలుగు నటుడితో లేదా ఒక సౌత్ ఇండియన్ నటుడిని తీసుకొని ఉంటే బాగుండేది అని చాలా మంది అంటున్నారు. లేదా రావణుడి పాత్ర కోసం అయినా అలా మనకి తెలిసిన నటుడిని తీసుకొని ఉంటే సినిమా మన తెలుగు హీరో సినిమాలాగా ఉండేది అని అంటున్నారు.

minus points in prabhas adipurush teaser

ప్రస్తుతం టీజర్ కి ఇలాంటి స్పందన వస్తున్నా కూడా ప్రభాస్ డైలాగ్ డెలివరీ మాత్రం గత రెండు సినిమాలతో పోలిస్తే ఈ సినిమా టీజర్ లో చాలా బాగుంది అని అంటున్నారు. దాంతో సినిమాలో కూడా ఇలాగే ఉంటే కచ్చితంగా హిట్ అవుతుంది అని చాలా మంది అంటున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో తెలియాలంటే సినిమా విడుదల అయ్యే అంతవరకు వరకు ఆగాల్సిందే.

watch video :