చాలా రోజుల నుండి ఎదురుచూసిన తర్వాత పుష్ప బృందం నుండి ఒక స్పెషల్ వీడియో వచ్చింది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియో విడుదల చేశారు. అయితే ఈ సినిమా పుష్ప మొదటి పార్ట్ కి కొనసాగింపు అనే విషయం అందరికీ తెలిసిందే.

Video Advertisement

మొదటి పార్ట్ లో ఒక రోజు వారి కూలీ నుండి సిండికేట్ గా ఎదిగిన పుష్ప ఇప్పుడు తన వ్యాపారాన్ని విస్తరించి ఇంకా ఎంత పెద్ద స్థాయికి వెళ్ళాడు అనే విషయం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఈ వీడియోలో జైలు నుండి పుష్ప పారిపోయినట్టు అతనికోసం అందరూ వెతుకుతున్నట్టు చూపించారు.

minus points in pushpa 2 the rule video

పుష్ప చనిపోయాడు అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి పుష్ప చనిపోలేదు బతికే ఉన్నాడు అని, అది ఒక కెమెరాలో రికార్డ్ అయ్యింది అని ఇందులో చూపించారు. అలా అల్లు అర్జున్ ఒక పులికి ఎదురు వెళ్తున్నట్టు ఈ వీడియోలో చూపించారు. ఈ వీడియో చూసి చాలా మంది బాగుంది అన్నారు. కానీ కొంత మందికి మాత్రం ఈ వీడియో అంత పెద్దగా నచ్చలేదు. దాంతో దీనిపై కామెంట్స్ వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

minus points in pushpa 2 the rule video

#1 ఇప్పుడు విడుదల అయిన పుష్ప – ద రూల్ వీడియో మొదటి భాగం అయిన పుష్పకి కొనసాగింపు. కానీ ఇది సడన్ గా చూస్తే ఇదేదో వేరే సినిమా అన్నట్టు అనిపిస్తోంది. మొదటిది ముగిసిన 6 సంవత్సరాల తర్వాత ఈ సినిమా మొదలు అవుతుంది. కానీ ఇప్పుడు విడుదల చేసిన వీడియో మొదటి భాగానికి కనెక్ట్ చేసేలా ఉంటే బాగుండేది అని అంటున్నారు.

minus points in pushpa 2 the rule video

#2 అసలు ఈ వీడియో ఒక కొత్త సినిమాలాగా అనిపించడానికి ముఖ్య కారణం మొదటి భాగంలో ఉన్న పాత్రలు ఇందులో ఎక్కువగా కనిపించకపోవడం. హీరో పుష్ప రాజ్, అతని స్నేహితుడు కేశవ తప్ప మిగిలిన వాళ్ళు ఎవరూ కూడా ఇందులో కనిపించరు. ఈ వీడియో ఒక ట్రైలర్ కంటే ఎక్కువ సేపు ఉంది. ఒక చిన్న టీజర్ అంటే అందులో అంత మంది పాత్రలు కనిపించడం కష్టం అనుకోవచ్చు. కానీ ఇంత పెద్ద వీడియో విడుదల చేసినప్పుడు కనీసం సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన పోలీస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్ ని కొన్ని సెకండ్స్ అయినా చూపిస్తే బాగుండేది అని అన్నారు.

minus points in pushpa 2 the rule video

#3 హీరో తప్పుడు దారిలో ఎన్నో పనులు చేస్తాడు. అందరి ముందు ఒక నేరస్తుడిలాగా కనిపిస్తాడు. కానీ హీరో అలా చేయడం వెనక చాలా పెద్ద మంచి కారణం ఉంటుంది. ఇలాంటి టెంప్లేట్ ఉన్న సినిమాలు ఇప్పటి వరకు మనం చాలా చూశాం. అసలు పుష్ప సినిమా ప్రేక్షకులకి నచ్చడానికి ముఖ్య కారణం హీరో పాత్ర నెగిటివ్ గా ఉండడమే. అలాంటిది ఇప్పుడు మళ్లీ పుష్ప రాజ్ చేసే పనుల వెనక ఇంత మంచి కారణం ఉంది అని, ఆయన సంపాదించిన డబ్బులు అన్ని వారి ఊరి ప్రజల మంచి కోసం ఉపయోగిస్తున్నాడు అని చూపించారు. ఇంత రొటీన్ పాయింట్ ఎందుకు చూపించారు అని కామెంట్స్ చేస్తున్నారు.

minus points in pushpa 2 the rule video

#4 అలా హీరో తప్పుడు దారిలో పనిచేసి అందరి ముందు ఒక నేరస్తుడిగా కనిపించాడు అనే పాయింట్ ఇటీవల విడుదలైన కేజీఎఫ్ సినిమాలో చూసాం. అసలు పుష్ప మొదటి పార్ట్ చూసినప్పుడే చాలా మంది కేజీఎఫ్ సినిమాతో పోలికలు ఉన్నాయి అని అన్నారు. ఇప్పుడు ఇది చూసిన తర్వాత, “ఇదేంటి మన తెలుగు కేజీఎఫ్ లాగా ఉంది?” అని అంటున్నారు. కానీ కేజీఎఫ్ సినిమాలో హీరోని చివరి వరకు కూడా నేరస్తుడిలాగానే చూపించారు. ఈ సినిమాలో మాత్రం ఇన్ని చెడ్డ పనులు చేసినా చివరికి హీరో మంచివాడు అన్నట్టే చూపిస్తున్నారు ఏమో అని అంటున్నారు.

minus points in pushpa 2 the rule video

#5 సినిమా అన్న తర్వాత ఎలివేషన్స్ ఉండాలి. కొన్ని ఎలివేషన్స్ నిజంగా ప్రేక్షకులకి నచ్చితే మరికొన్ని మాత్రం కొంచెం ఓవర్ అనిపించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన డైలాగ్ కూడా ప్రేక్షకులకు అలాగే అనిపించింది. పులి రెండు అడుగులు వెనక్కి వేసింది అంటే పుష్ప రాజ్ వచ్చాడు అని అర్థం అనే డైలాగ్ కొంచెం ఎక్కువగా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ డైలాగ్ ఎప్పుడో లీక్ అయ్యింది. అయినా కూడా ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత, “మరి ఇంత ఎలివేట్ చేయడం అవసరమా?” అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

minus points in pushpa 2 the rule video

ఇన్ని కామెంట్స్ వస్తున్నా కూడా సినిమా బృందం విడుదల చేసిన అల్లు అర్జున్ పోస్టర్ మీద మాత్రం చాలా మంది ప్రశంసిస్తున్నారు. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ఇంత గొప్ప పాత్ర చేయడం అనేది చాలా మంచి విషయం అని అంటున్నారు. సినిమా కూడా రొటీన్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటే అల్లు అర్జున్ కచ్చితంగా నెక్స్ట్ పాన్ – ఇండియన్ స్టార్ అవుతారు అని అంటున్నారు.