తమిళ్ స్టార్ విజయ్ కి తెలుగులో చాలా క్రేజ్ ఉంది. తెలుగులో విజయ్ సినిమాలు చేయకపోయినా కూడా చాలా గుర్తింపు ఉన్న హీరో అయ్యారు. ఇప్పుడు విజయ్ వారసుడు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తమిళ్ సినిమా అయినా కూడా తెలుగులో డబ్ అయ్యి విడుదల అవుతోంది.

Video Advertisement

ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే ఎంతో మంది పెద్ద నటీనటులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. అయితే ఈ ట్రైలర్ కి మాత్రం రెస్పాన్స్ అనుకున్న విధంగా రావట్లేదు అని చెప్పాలి.

minus points in varisu movie trailer

అంతకుముందు సినిమా పోస్టర్స్ చూసి మహర్షి సినిమా గుర్తొస్తోంది అన్నారు. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత మహర్షి సినిమా మాత్రమే కాదు. ఇంకా చాలా తెలుగు సినిమాలు గుర్తొస్తున్నాయి అంటున్నారు. అసలు ట్రైలర్ లో చాలా కథ అర్థం అయిపోతుంది అని అంటున్నారు. అయితే ట్రైలర్ లో మైనస్ అయిన కొన్ని విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

minus points in varisu movie trailer

#1 అసలు ట్రైలర్ చూస్తున్నంతసేపు ఒక కొత్త సినిమా ట్రైలర్ చూస్తున్నాం అనే ఆసక్తి ఉండదు. మొదటి ఫ్రేమ్ నుంచే చివరి ఫ్రేమ్ వరకు ట్రైలర్ మొత్తం ఎక్కడో చూసినట్టే అనిపిస్తూ ఉంటుంది. ఒకటి కాదు. రెండు కాదు. చాలా సినిమాలు ఈ ట్రైలర్ లో కనిపించాయి. ఎప్పుడో విడుదల అయిన సినిమా నుండి ఇటీవల విడుదల అయిన సినిమా వరకు చాలా సినిమాలు ఇందులో ఉన్నట్టు అనిపిస్తోంది.

minus points in varisu movie trailer

#2 ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. ఒకవేళ తమిళ్ లో ఇలాంటి సినిమా విడుదల చేస్తే అది చూస్తే వారికి కొత్తగా అనిపించే అవకాశం ఉంది. కానీ తెలుగులో ఇలాంటి సినిమాలు మనం చాలా చూసాం కాబట్టి సినిమా ట్రైలర్ లో ఇంకా కొంచెం ఆసక్తికరంగా ఉండే కొన్ని సీన్స్ కానీ డైలాగ్స్ కానీ యాడ్ చేసి ఉంటే బాగుండేది అని అంటున్నారు.

minus points in varisu movie trailer

#3 ఈ సినిమా ట్రైలర్ చూస్తూ ఉంటే హీరోయిన్ పాత్ర కూడా ప్రతి కమర్షియల్ సినిమాల్లో ఉండే ఒక టెంప్లేట్ హీరోయిన్ పాత్ర అని అర్థం అవుతోంది. పాటలకి ముందు వచ్చి పాటల తర్వాత వెళ్ళిపోయే పాత్ర అని అనిపిస్తోంది. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు. దాంతో సినిమాలో హీరోయిన్ పాత్ర ఎలా ఉండబోతోంది అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు.

minus points in varisu movie trailer

#4 ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించిన తమన్ ఇచ్చిన పాటలు ఇప్పటికే చాలా పెద్ద హిట్ అయ్యాయి. అయితే ఇలాంటి చాలా సినిమాలకు తమన్ పాటలు ఇచ్చారు. అందులో చాలా వరకు ఇలాంటి కమర్షియల్ సినిమాలే ఉన్నాయి. ఈ ట్రైలర్ కి వచ్చిన బ్యాక్ గ్రౌండ్ వింటే ఏదో పాత సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లాగా అనిపిస్తుంది. మ్యూజిక్ కూడా ఇంకా కొంచెం కొత్తగా ఉంటే బాగుండేది అని అంటున్నారు.

minus points in varisu movie trailer

#5 సినిమాలో నటీనటులు అందరూ మనకి తెలిసిన వాళ్లే. అయితే వారందరూ అంతకు ముందు కూడా చాలా సినిమాల్లో ఇలాంటి పాత్రలు పోషించారు. దాంతో ఈ సినిమాలో నటీనటుల విషయంలో కూడా ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది అని అన్నారు. వారు అలాంటి పాత్రలే అంతకుముందు చాలా సినిమాల్లో చేశారు కాబట్టి ప్రేక్షకులకి కొత్తగా అనిపించకపోవచ్చు అని అంటున్నారు.

minus points in varisu movie trailer

ప్రస్తుతం అయితే ట్రైలర్ కి ఇలాంటి టాక్ వస్తోంది. ఈ సినిమా విడుదల అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూడాలి. కొంత మంది, “ట్రైలర్ చాలా సాధారణంగా ఉంది” అంటే, మరికొంతమంది మాత్రం, “ట్రైలర్ ఇలా ఉన్నా సినిమా చాలా బాగుంటుంది” అని అంటున్నారు. మరి సినిమా ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి అంటే విడుదల అయ్యే అంతవరకు ఆగాల్సిందే.