“వాల్తేరు వీరయ్య” సినిమాలో… మైనస్ అయిన 4 విషయాలు ఇవేనా..?

“వాల్తేరు వీరయ్య” సినిమాలో… మైనస్ అయిన 4 విషయాలు ఇవేనా..?

by Mohana Priya

Ads

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఇటీవల విడుదల అయ్యింది. చిరంజీవి నటించిన గత రెండు సినిమాలు ఆచార్య, అలాగే గాడ్ ఫాదర్ కూడా ఆశించిన ఫలితాన్ని పొందలేదు. దాంతో ప్రేక్షకుల ఆశలు అన్నీ కూడా ఈ సినిమా మీదే ఉన్నాయి.

Video Advertisement

చిరంజీవి మాత్రమే కాకుండా ఈ సినిమాలో రవితేజ కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు. చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి, రవితేజ ఈ సినిమాలో కలిసి కనిపించారు. సంక్రాంతి సందర్భంగా విడుదల అయిన ఈ సినిమాకి టాక్ మిక్స్డ్ గా వస్తోంది. ఒక్కొక్కరు సినిమా గురించి ఒక్కొక్క రకంగా కామెంట్స్ చేస్తున్నారు.

memes on chiru waltair veerayya movie release..

కొంత మంది, “సినిమా చాలా బాగుంది. పాత చిరంజీవిని చూసినట్టు ఉంది” అని అంటూ ఉంటే, మరి కొంత మంది మాత్రం, “సినిమా చాలా రొటీన్ గా ఉంది” అని అంటున్నారు. వాల్తేరు వీరయ్య సినిమా మాత్రమే కాకుండా బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి సినిమా కూడా సంక్రాంతి సందర్భంగా విడుదల అయ్యింది. కానీ వాల్తేరు వీరయ్య సినిమాలో కొన్ని విషయాలు మైనస్ అయ్యాయి అని అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

waltair veerayya movie review

#1 కొన్ని పాత్రలు తీర్చిదిద్దిన విధానంపై కామెంట్స్ వస్తున్నాయి. అందులోనూ ముఖ్యంగా ప్రకాష్ రాజ్ పాత్ర అయితే చాలా రొటీన్ గా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే బాగున్నా కూడా ఆ కథ విషయంలో అస్సలు కొత్తదనం లేదు అని కామెంట్స్ వచ్చాయి. అసలు నెక్స్ట్ ఏమవుతుంది అనే విషయాన్ని మొదటిసారి సినిమా చూస్తున్న ప్రేక్షకులు కూడా ఆలోచించకుండా కనిపెట్టేయొచ్చు. ఎక్కడా కూడా సినిమా కొత్తగా అనిపించదు.

waltair veerayya ott update..!!

#2 కొన్ని సీన్స్ అసలు లాజిక్ తో సంబంధం లేకుండా ఉన్నాయి. అందుకు ఉదాహరణ మొదటిగా వచ్చే సీన్. అందులో అయితే కొంత మంది నేవీ అధికారులు వారికి సమస్య ఎదురయ్యింది అని వారిని కాపాడడానికి అక్కడ పోర్ట్ లో పనిచేసే ఒక సాధారణ వ్యక్తి వస్తాడు అని చూపించారు. అసలు నేవీ అంటేనే చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది. అంత పెద్ద అధికారులని ఒక మామూలు వ్యక్తి వచ్చి కాపాడడం ఏంటి అని అన్నారు.

Minus points in waltair veerayya trailer

#3 సినిమాకి పాటలు హైలైట్ అయ్యాయి. అందులోనూ ముఖ్యంగా ఆ పాటల్లో చిరంజీవి వేసిన స్టెప్స్ అయితే నిజంగానే పూనకాలు తెప్పించే లాగానే ఉన్నాయి అని కామెంట్స్ వచ్చాయి. కానీ అసలు ఒకటి రెండు పాటలు అయితే అనవసరంగా వచ్చాయి ఏమో అనిపిస్తుంది. సినిమా చివరికి వచ్చేటప్పటికి చాలా ఎమోషనల్ గా సాగుతూ ఉంటుంది. ఆ సమయంలో ఒక పాట వస్తుంది. అసలు అలాంటి సమయంలో పాట అవసరమా అని కామెంట్స్ వచ్చాయి.

umair sandhu review about waltair veerayya trailer..

#4 సినిమాలో హీరో పాత్ర విడిగా, శృతి హాసన్ పాత్ర పాత్ర విడిగా బాగానే డిజైన్ చేశారు. కానీ ఇద్దరి మధ్య వచ్చేసి సీన్స్ మాత్రం కాస్త డిఫరెంట్ గా అనిపించాయి. అసలు వారిద్దరి కాంబినేషన్ చూస్తూ ఉంటే హీరో హీరోయిన్లలాగా అనిపించలేదు అనే కామెంట్స్ కూడా బాగా వినిపించాయి. దాంతో ఇద్దరి పాత్రలు బాగానే ఉన్నా కూడా, కాస్త వారి మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్ విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది అని అన్నారు.

tug of war between waltair veerayya, veerasimha reddy..

ప్రస్తుతం సినిమా అయితే థియేటర్లలో నడుస్తోంది. ఎన్ని మైనస్ పాయింట్లు ఉన్నా కూడా అక్కడ ఉన్నది మెగాస్టార్ చిరంజీవి కాబట్టి, అది కూడా చాలా రోజుల తర్వాత చిరంజీవి ఇంత యాక్టివ్ గా ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన సినిమా చేశారు కాబట్టి సినిమా హిట్ అవుతుంది అని అంటున్నారు.


End of Article

You may also like