మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ట్రైలర్ ఇవాళ విడుదల అయ్యింది. సినిమా ట్రైలర్ చూస్తూ ఉంటే ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్థమవుతుంది. ఇందులో చిరంజీవి గెటప్ కూడా చాలా కొత్తగా ఉంది. ట్రైలర్ చూస్తున్నంత సేపు పాత చిరంజీవిని చూసినట్టు ఉంది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు రవితేజ కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు.

Video Advertisement

అలాగే శృతి హాసన్, కేథరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటించారు. ట్రైలర్ లో వీరితోపాటు బాబీ సింహా, సత్య రాజ్, వెన్నెల కిషోర్, ప్రకాష్ రాజ్, శ్రీనివాసరెడ్డి ఇంకా ఎంతోమంది ప్రముఖ నటీనటులు కనిపిస్తున్నారు. అయితే ఈ ట్రైలర్ పై కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇందులో ఈ విషయాలు కొంచెం మైనస్ అయ్యాయి అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Minus points in waltair veerayya trailer

#1 ట్రైలర్ లో చాలా వరకు ఈ యాక్షన్ కనిపిస్తోంది. అంటే ఫైటింగ్ సీన్స్ ఎక్కువగా చూపించారు అని అంటున్నారు. కొంచెం కామెడీ కూడా యాడ్ చేశారు. అవి మాత్రమే కాకుండా కాస్త వేరే ఎమోషనల్ సీన్స్ కూడా ఉండి ఉంటే ట్రైలర్ ఇంకా బాగుండేది అని అంటున్నారు.

Minus points in waltair veerayya trailer

#2 ట్రైలర్ మొత్తం డైలాగ్స్ తో నింపేశారు అని అంటున్నారు. అన్ని ఎక్కువ డైలాగ్స్ ఉండకుండా ట్రైలర్ కట్ ఉంటే బాగుండేది అని అన్నారు. కానీ మరి కొంతమంది మాత్రం చివరిలో వచ్చే డైలాగ్ అయితే ట్రైలర్ మొత్తానికి హైలైట్ అయ్యింది అని అంటున్నారు.

Minus points in waltair veerayya trailer

#3 ట్రైలర్ చూస్తుంటే కథ చాలా వరకు అర్థమయిపోయింది అని కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. అలాగే అంతకుముందు కూడా చిరంజీవి ఈ సినిమాలో కథలో కొత్తదనం లేకపోయినా సినిమా చాలా బాగుంటుంది అని అర్థం వచ్చేలాగా ఒక కామెంట్ చేశారు. దాంతో కథ అంతకు ముందు చాలా సినిమాల్లో చూసినట్టు ఉంది అని అంటున్నారు.

Minus points in waltair veerayya trailer

#4 చిరంజీవి అంటే ముందుగా మనకి గుర్తొచ్చేది డాన్స్. ఈ పాటలో కొన్ని సాంగ్ ట్యూన్స్ చూపించారు కానీ చిరంజీవి డాన్స్ ఇంకా కొంచెం ఎక్కువగా చూపించి ఉంటే బాగుండేది అని అంటున్నారు. పాటలు వింటూ ఉంటేనే చాలా ఎనర్జిటిక్ గా ఉన్నాయి. దాంతో ఇంకా కొన్ని స్టెప్స్ ట్రైలర్ లో చూపించాల్సింది అని అంటున్నారు. కానీ మరి కొంతమంది ఏమో అవన్నీ థియేటర్ లో చూస్తే బాగుంటుంది అని ఉద్దేశంతోనే సినిమా బృందం ట్రైలర్ ఇలా చేసి ఉంటారు అని అంటున్నారు.

Minus points in waltair veerayya trailer

#5 సినిమాలో రవితేజ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు అన్న సంగతి తెలిసిందే. అయితే రవితేజకు సంబంధించి అంతకుముందు ఒక వీడియో విడుదల చేశారు. టైలర్ లో కూడా అదే వీడియో యాడ్ చేశారు. అదికాకుండా రవితేజ గురించి ఇంకొక స్పెషల్ సీన్ ఏదైనా చూపిస్తే బాగుండేది అని అంటున్నారు.

Minus points in waltair veerayya trailer

ఇలాంటి చిన్న చిన్న కామెంట్స్ వస్తున్నా కూడా ట్రైలర్ కి దాదాపు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అసలు చిరంజీవిని ఇలా చూసి చాలా సంవత్సరాలు అయ్యింది అని అంటున్నారు. కొంత మంది అయితే సినిమా కథ ఎలా ఉన్నా కూడా ఖచ్చితంగా హైట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉంది మెగాస్టార్ చిరంజీవి అని అంటున్నారు. దాంతో ప్రేక్షకులందరికీ కూడా ఈ ట్రైలర్ తర్వాత సినిమాపై ఇంకా ఆసక్తి పెరిగింది.