మిస్ వరల్డ్ 2021 పోటీకి వెళ్లే ఈ హైదరాబాద్ యువతి ఎవరు..? ఆమె ఈ పోటీకి వెళ్లడం వెనక ఎవరు ఉన్నారో తెలుసా..?

మిస్ వరల్డ్ 2021 పోటీకి వెళ్లే ఈ హైదరాబాద్ యువతి ఎవరు..? ఆమె ఈ పోటీకి వెళ్లడం వెనక ఎవరు ఉన్నారో తెలుసా..?

by Anudeep

Ads

ఈ అమ్మాయి పేరు మానస వారణాసి. అందంగా ఉంది కదూ.. ఈ అమ్మాయి అందమైన అమ్మాయి మాత్రమే కాదు అందమైన మనసు ఉన్న అమ్మాయి కూడా. ఈ ఏడాది డిసెంబర్ 16 న మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలలో భారత దేశం తరపున హైదరాబాద్ కు చెందిన అమ్మాయి మానస వారణాసి పాల్గొంటున్నారు.

Video Advertisement

ఈ పోటీలలో గెలిచి మిస్ వరల్డ్ 2021 టైటిల్ ను సొంతం చేసుకోవడానికి ఆమె సిద్ధంగా ఉన్నారు. ఈ మిస్ వరల్డ్ 2021 పోటీలు ప్యూర్టో రికోలోని శాన్ జువాన్, కోకాకోలా మ్యూజిక్ హాల్‌లో జరగనున్నాయి.

manasa 1

ఈ పోటీలలో భారత్ తరపున పాల్గొనే మానస వారణాసి గురించి తెలుసుకుందాం. ఈమె ఈ ఏడాది ఫిబ్రవరిలో మిస్ ఇండియా 2020 టైటిల్ ను కూడా సొంతం చేసుకుంది. మిస్ వరల్డ్ 2000 పోటీ విజేత, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మానస కు ఇన్స్పిరేషన్. ఆమెను ఇన్స్పిరేషన్ గా తీసుకుని మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీల్లో కూడా పార్టిసిపేట్ చేసింది. శాస్త్రీయ నృత్యం భరతనాట్యంలో మానస ప్రావీణ్యత సంపాదించుకుంది.

manasa 2

అంతేకాదు.. ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ ప్రాజెక్ట్ (BWAP) కోసం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేస్తోంది. ఇందులో భాగంగానే మహిళలు, పిల్లల హక్కుల కోసం కొన్ని తక్షణ చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. మానస తండ్రి ఉద్యోగరీత్యా మలేషియా కు వెళ్లడంతో మానస తన గ్రేడ్ 10 చదువును జిఐఐఎస్ మలేషియా క్యాంపస్ నుంచి పూర్తి చేసింది. ఇంటర్ చదువును హైదరాబాద్ లోని ఎఫ్ఐఐటి జెఈఈలో పూర్తి చేసింది. ఆ తరువాత వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ ను పూర్తి చేసింది. ప్రస్తుతం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ అనలిస్ట్‌ గా జాబ్ కూడా చేస్తోంది.

manasa 3

అనేక సోషల్ ఆక్టివిటీస్ లో కూడా మానస చురుకుగా పాల్గొంటారు. మిస్ ఇండియా టైటిల్ ని గెలవడానికి ముందు కూడా ఆమె స్థానికంగా ఉన్న ఎన్జీఓ తో కలిసి పని చేసింది. పేద విద్యార్థులకు ఇంగ్లీష్, మాథెమాటిక్స్ ను బోధించడం ఆమెకు హాబీ. మానస వయసు 23 సంవత్సరాలు. ఆమె తన శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడం కోసం నిరంతరం యోగ చేస్తారు. చెల్లి, అమ్మ, అమ్మమ్మ తన జీవితంలో తనని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తులు అని మానస చెబుతూ ఉంటుంది. మిస్ వరల్డ్ 2021 టైటిల్‌ను గెలుచుకోవడమే తన కల అని మానస గర్వం గా చెబుతుంది. ఈ పోటీలో దాదాపు 100 మంది పాల్గొంటున్నారు. వారందరిలో మన మానస విజేత అవ్వాలని మనస్ఫూర్తిగా విషెస్ చెప్దామా..


End of Article

You may also like